Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : చైనాకు చెందిన బిలియనీర్, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఏడాది కాలంలోనే తన మార్కెట్ విలువలో 344 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.25 లక్షల కోట్లు) పోగొట్టుకున్నారు. చైనా సర్కార్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు.. అక్కడి ప్రభుత్వ, మదుపర్ల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఏడాది క్రితం చేసిన వ్యాఖ్యలు వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయేలా చేశాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో అలీబాబా షేర్లు వరుసగా పతనమవుతూ వచ్చాయి. అందుకే అలీబాబా గ్రూప్ సంపదతో పాటు జాక్ మా నికర సంపద కూడా కరిగిపోతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీ విలువ కూడా ఒక ఏడాదిలో ఇంతలా నష్టపోలేదు.