Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ విద్యుత్ వాహనాలపై భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. వచ్చే నాలుగేండ్లలో 10 ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించనున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం రూ.15,000 కోట్ల పెట్టుబడులకు ప్రకటన చేసింది. ప్రయివేటు ఈక్విటీ సంస్థ టిపిజి రైజ్ క్లైమేట్ టాటా మోటార్స్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2022-23 నాటికి ఇవి విభాగంపై భారీగా వెచ్చించడానికి రెడీ అయింది. ఈ సెగ్మెంట్లో 70 శాతం వాటాతో టాటా మోటార్స్ ఇప్పటికే మార్కెట్ లీడర్‌గా ఉంది. నెక్సాన్, టైగర్ ఇవిలకు నెలకు 3000 నుంచి 3500 యూనిట్ల వరకూ బుకింగ్స్ వస్తున్నాయని తమ సామర్ధ్యం మెరుగుపరుచుకునేందుకు కనీసం మరో పది నూతన గ్రీన్ వాహనాలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని టాటా మోటార్స్ ఈవీ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. ఈ దిశగా ఉత్పత్తి సామర్ధ్యం పెంచడంతో పాటు చార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు. వచ్చే నాలుగైదేండ్లలో మొత్తం వ్యాపారంలో ఈవీ వాటా 20 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తోంది.