Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నలతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలో నెంబర్ 1 సస్టెయినబల్ బేబీ కేర్ బ్రాండ్, సూపర్‌బాటమ్స్ ఇప్పుడు దేశంలో ఆవిష్కరణలను తీసుకువస్తూ, విప్లవాత్మకమైన లాండ్రీ డిటర్జెంట్ ‘సూపర్ లాండ్రీ షీట్స్’ విడుదల చేయడం ద్వారా లాండ్రీ విభాగంలో నూతన విభాగాన్ని సృష్టించడంలో అగ్రగామిగా నిలిచింది. ఈ డిటర్జెంట్ షట్లను ప్రత్యేకంగా శిశువులు, చిన్నారుల వస్ర్తాలు, వస్త్ర డైపర్ల కోసం తీర్చిదిద్దారు. వీటిలో ఎలాంటి హానికర రసాయనాలు ఉండవు. సున్నితమైన చర్మం కలిగిన చిన్నారులతో పాటుగా తమ వస్త్రాలను తరచుగా ఉతుకుతున్న వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి.
సాధారణ లాండ్రీ డిటర్జెంట్స్ వస్త్రాలను తరచుగా ప్రభావవంతంగా శుభ్రపరిచినప్పటికీ, వాటిలో హానికరమైన రసాయనాలు అయినటువంటి ఫాస్పేట్స్, బ్లీచ్, ఎస్ఎల్ఎస్/ఎస్ఎల్ఈఎస్ మరియు ఆప్టికల్ బ్రైట్నర్స్ వంటివి ఉంటాయి. వీటి అవశేషాలు వస్త్రాలపై మిగిలి ఉంటాయి. ఇవి చిన్నారుల చర్మంతో పాటుగా పర్యావరణానికీ హాని కలిగిస్తాయి సూపర్ లాండ్రీ షీట్స్ లో సూపర్ కాన్సన్ట్రేటెడ్ డిటర్జెంట్ ఫార్ములా ఉంది. అతి తక్కువ ఫిల్టర్లతో మరింత శుభ్రపరిచే అంశాలను కలిగి ఉంది కానీ వీటిలో ఎలాంటి హానికర రసాయనాలు లేవు. అందువల్ల ఇవి శిశువులు, చిన్నారుల వస్త్రాలు శుభ్ర పరచడానికి సురక్షితంగా ఉంటాయి. అదే సమయంలో పర్యావరణ అనుకూలంగానూ ఇవి ఉంటాయి.
‘‘భారతదేశంలో మొట్టమొదటి పర్యావరణ అనుకూల డిటర్జెంట్ షీట్లను విడుదల చేస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది మీ లాండ్రీ అనుభవాలను క్లిష్టతరం, సమయం అధికంగా తీసుకుంటుంది అనే భావన నుంచి సౌకర్యవంతమైన, ఆస్వాదించతగిన కార్యక్రమంగా మారుస్తుంది. మీరు ఇక ఎంత మాత్రమూ విభిన్న ఉత్పత్తులను అన్వేషించడం లేదా సాధారణ లాండ్రీ డిటర్జెంట్స్ కారణంగా హానికరమైన ప్రభావాలను గురించి ఆందోళన చెందాల్సిన అవసరం సూపర్ లాండ్రీ షీట్స్‌తో ఇక ఎంత మాత్రమూ ఉండదు. మేము వేస్తోన్న ఈ చిరు అడుగులు ఇప్పటి వరకూ జరిగిన నష్టాన్ని పూరించేందుకు ఎంతో దూరం వెళ్లనున్నాయి. తగిన చర్యలు తీసుకునేందుకు ఇది తగిన సమయం. మన శిశువులతో పాటుగా పర్యావరణానికి సైతం మేలు కలిగించే ఉత్పత్తిని ఉత్పత్తి చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని పల్లవి ఉతగి, ఫౌండర్, సూపర్‌బాటమ్స్ అన్నారు.
సూపర్‌బాటమ్స్ సూపర్ లాండ్రీ షీట్స్ 10 షీట్స్ ప్యాక్ ధర 99 రూపాయలు కాగా, 45, 90 షీట్ల ప్యాక్‌లు వరుసగా 420, 790 రూపాయలలో లభిస్తాయి. ఇవి సబ్‌స్ర్కిప్షన్ ఆఫర్ కింద www.superbottoms.com.వద్ద కూడా లభిస్తాయి.