Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: సుప్రసిద్ధ భారతీయ మీడియా, వినోద పవర్‌హౌస్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్ – ZEEL), తమ నూతన అ–లా–కార్ట్ ఛానెల్, బొకే ధరలను నూతన టారిఫ్ ఆర్డర్ (ఎన్టీఓ) 2.0కు సంబంధించి తేదీన బాంబే హై కోర్టు ఆదేశాలకనుగుణంగా ప్రకటించింది . తద్వారా భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది వీక్షకుల వైవిధ్యమైన వినోదావసరాలను తీర్చనుంది. నూతన టారిఫ్ ఆర్డర్ (ఎన్టీఓ) 2.0కు అనుగుణంగా గౌరవనీయ సుప్రీంకోర్టు వద్ద న్యాయనిర్ణయం కోసం పెండింగ్‌లో ఉన్న వేళ జీల్ యొక్క హక్కులు, వాదనల పరంగా ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ ధరలను విడుదల చేస్తున్నారు.
దాదాపు మూడు దశాబ్దాల క్రితం కార్యకలాపాలను ప్రారంభించిన జీల్, భారతీయ వీక్షకులతో లోతైన, శక్తివంతమైన సంబంధాన్ని నిర్మించుకుంది. జీల్, అత్యుత్తమ, వైవిధ్యమైన వినోదాన్ని బహుళ వీక్షకుల విబాగాలు, జెనర్స్‌లో అందిస్తుంది. ఈ సంస్థ యొక్క విస్తృత శ్రేణి నెట్‌వర్క్‌లో 67 ఛానెల్స్, 11 భాషలలో ఉన్నాయి. భారతదేశ వ్యాప్త నెట్వర్క్ ద్వారా ప్రతి వారం 606 మిలియన్ల మంది వీక్షకులను చేరుకోవడంతో పాటుగా వీరంతా కలిపి 163 బిలియన్లకు పైగా నిమిషాలు ఈ నెట్‌వర్క్‌పై గడుపుతున్నారు. హిందీతో పాటుగా ప్రాంతీయ భాషా మార్కెట్ల అయిన మరాఠీ, బంగ్లా, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, భోజ్‌పురి, ఒడియా, పంజాబీ, ఇంగ్లీష్లలో అత్యధిక వ్యూయర్షిప్ను జీఈసీ, మూవీస్, న్యూస్, మ్యూజిక్, లైఫ్‌స్టైల్, హెచ్డీ జెనర్స్‌లో కలిగి ఉంది.
ఈ నూతన ఛానెల్ ప్రైసింగ్ గురించి రాహుల్ జోహ్రి, అధ్యక్షులు– బిజినెస్, దక్షిణాసియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘జీల్ యొక్క సాటిలేని విజయం , భారతదేశ వ్యాప్తంగా వీక్షకులతో సంస్ధకు ఉన్న బలీయమైన బంధంతోనే సాధ్యమయింది. అలాగే మొత్తం వాటాదారులతో ఇది నిర్మించుకున్న బంధమూ దీనికి కారణమే. ఈ అసాధారణ భాగస్వామ్యాలు కారణంగానే దాదాపు మూడు దశాబ్దాలుగా పలు మార్కెట్లో ఆధిపత్యం చూపేందుకు వీలు కలిగింది. అత్యంత వినోదాత్మకమైన, అత్యధిక నాణ్యత కలిగిన కంటెంట్ ను సమర్పించడం, ఆదాయ సముపార్జన తో సృజనాత్మక పరిష్కారాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ ఛానెల్స్‌ను వృద్ధి చేసి ద్వారా మొత్తం వ్యవస్థకు విలువను సృష్టించనున్నాం. ఎన్టీఓ 2.0 అమలు చేయడం ద్వారా జీఛానెల్స్ తమ వృద్ధి వేగం కొనసాగించగలవని, కంపెనీకి అత్యధిక విలువను సృష్టించగలవనే మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము’’ అని అన్నారు.
ఈ ప్రకటన గురించి అతుల్ దాస్, చీఫ్ రెవిన్యూ ఆఫీసర్ అఫిలియేట్ సేల్స్ మాట్లాడుతూ ‘‘జీల్ వద్ద మేము అత్యుత్తమ వినోదాన్ని మా వినియోగదారులకు అందించేందుకు కట్టుబడి ఉన్నాము. 2019లో నూతన ధరల విధానం, భారతదేశంలో టెలివిజన్‌ను చూస్తున్న తీరును సమూలంగా మార్చింది. ఓ వైపు ఇది ఛానెల్స్ గరిష్ట ధరల పరంగా పారదర్శకత తీసుకువస్తే, మరో వైపు వినియోగదారులకు తాము ఎంచుకోవాలనుకున్న ఛానెల్స్‌ను ఎంచుకునే స్వేచ్ఛనూ అందించింది. ఎన్టీఓ 2.0తో వినియోగదారులకు ఈ ఎంపిక మరింత సౌకర్యంగా మారుతుంది. దేశవ్యాప్తంగా విభిన్న ధరల వద్ద మేము వినియోగదారులకు పలు బొకేలను అందించడం కొనసాగించనున్నాం. ప్రీమియం ఆంగ్ల ఛానెల్స్ అయినటువంటి జీ కేఫ్ మరియు & ఫ్లిక్స్ లు ఇప్పుడు కూడా ప్రత్యేక బొకేలో లభ్యమవుతాయి. ప్రతి బొకేలోనూ పలు ఛానెల్స్ మిళితమై ఉంటాయి. వీటిలో జీఈసీ, సినిమాలు, న్యూస్, సంగీతం, లైఫ్‌స్టైల్ జెనర్స్ ఉంటాయి. అత్యంత సౌకర్యవంతంగా ఈ సేవలను అందించేందుకు మా డీపీఓ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.
విప్లవాత్మకమైన, వినోదాత్మకమైన ఒరిజినల్ కంటెంట్‌ను సృష్టించడంలో జీల్ యొక్క నైపుణ్యం, కోట్లాది వీక్షకుల నడమ ప్రతిధ్వనిస్తూనే, ఎదురులేని నాయకత్వంకు తోడ్పడుతుంది. సరాసరిన, ఇది ప్రతి వారం 419 గంటల నూతన కంటెంట్‌ను సృష్టిస్తుంది. భారతదేశంలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన వినియోగదారుల బ్రాండ్‌గా ఇది నిలుపుతుంది. పండుగ సీజన్‌కు సిద్ధమవుతూ ఇది 40 ఫిక్షన్, 20 నాన్ ఫిక్షన్ నూతన సిరీస్‌లను బహుళ భాషలలో విడుదలచేయనుంది. హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషలలో అతి పెద్ద మూవీ ఛానెల్ పోర్ట్‌ఫోలియో కలిగి ఉండటంతో పాటుగా రాబోయే కొద్ది వారాలలో 40 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్లను పలు ఛానెల్స్‌లో ప్రసారం చేయనుంది. తద్వారా కోట్లాది మంది వినియోగదారులకు అసాధారణ వినోద అవకాశాలను అందించనుంది. తమ జీ టీవీ, జీ సినిమా, & టీవీ, & పిక్చర్స్ మరియు జీ అన్మోల్ వంటి బ్రాండ్లతో హిందీ మాట్లాడే మార్కెట్లలో శక్తివంతమైన స్థానం నిలుపుకోవటంతో పాటుగా బంగ్లా, మరాఠీ మార్కెట్లలో జీ బంగ్లా, జీ మరాఠీ ద్వారా సుదీర్ఘమైన వ్యూయర్షిప్ను కలిగి ఉంది. దక్షిణ భారత మార్కెట్లలో జీ కన్నడ, జీ తమిళ్, జీ తెలుగు, జీ కేరళం ద్వారా విస్తృతశ్రేణి ఉనికి చాటుతుంటే, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లు అయిన భోజ్‌పురి, పంజాబీ, ఒడియాలలో జీ బిస్కోప్, జీ పంజాబీ, జీ సార్థక్ ద్వారా నాయకత్వ స్థానం నిర్మించుకుంటుంది. ఈ కంపెనీ అత్యంత శక్తివంతమైన సినిమా ఛానెల్ పోర్ట్‌ఫోలియోను కూడా కలిగి ఉంది. జీ సినిమా, & పిక్చర్స్, జీ బాలీవుడ్, జీ యాక్షన్,జీ అన్మోల్ సినిమా జీ క్లాసిక్ లు హిందీ మాట్లాడే ప్రాంతాలలో ఉంటే, జీ టాకీస్, జీ చిత్రమందిర్లు పశ్చిమ భారతదేశంలో జీ సినిమాలు, జీ పిచ్చర్ మరియు జీ థిరాయ్లు దక్షిణ భారత మార్కెట్లో, జీ బంగ్లా సినిమా, జీ బిస్కోప్లు తూర్పు భారతదేశంలో ఉన్నాయి. అంతేకాదు, ఇది ఎంపిక చేసిన శ్రేణి ఆంగ్ల సినిమాలు, వినోదం, లైఫ్‌స్టైల్ పోర్ట్‌ఫోలియోను సైతం కలిగి ఉంది. దీనిలో జీ కేఫ్, అండ్ ఫ్లిక్స్, అండ్ ప్రివ్ హెచ్డీ, మ్యూజిక్ యూత్ ఛానెల్స్ అయిన జింగ్, జెస్ట్ 20 హెచ్డీ ఛానెల్స్ అత్యున్నత వీక్షణ అనుభవాలను వివేకవంతులైన వీక్షకులకు అందిస్తున్నాయి.