Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ, ఇన్వెస్ట్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకున్నట్లు ఒప్పో ఇండియా వెల్లడించింది. తద్వారా దేశంలో టెక్ స్టార్టప్స్‌కు తమ మద్దతును అందించనుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఒప్పో ఎలివేట్ కార్యక్రమం అతి సన్నిహితంగా యాక్సలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్ (A+చీ×ఱ వీఱరరఱశీఅ)తో అతి సన్నిహితంగా పనిచేయనుంది. భారత ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారు కార్యాలయంకు సంబంధించిన కార్యక్రమం అగ్నిఐ మిషన్. ఈ భాగస్వామ్యంతో ఒప్పో, ఆవిష్కర్తలు, సాంకేతిక నిపుణులు, యువ స్టార్టప్స్ నుంచి భాగస్వామ్యం స్వాగతించడంతో పాటుగా విప్లవాత్మక సాంకేతికతలను ప్రదర్శించేందుకు ఆహ్వానిస్తుంది. ఏఐ, ఏఆర్/వీఆర్, హోమ్ ఆటోమేషన్,ఐఓటీ, హెల్త్‌కేర్, 5జీ , డాటా ప్రొటెక్షన్ సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిశ్రమలలో ఆవిష్కర్తల నుంచి ఎంట్రీలను ఆహ్వానించడంపై ఈ ప్లాట్‌ఫామ్ దృష్టి సారించింది. ఈ విస్తృత శ్రేణి భాగస్వామ్యంతో, ఒప్పో ఎలివేట్ కార్యక్రమం యువ స్టార్టప్స్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల వ్యవస్థలో ప్రవేశించేందుకు సహాయపడనుంది.
ఈ కార్యక్రమం గురించి శ్రీ తస్లీమ్ అరీఫ్ , వైస్ ప్రెసిడెంట్, ఇండియా ఆర్ అండ్ డీ హెడ్, ఒప్పో ఇండియా మాట్లాడుతూ 'ఇన్వెస్ట్ ఇండియా, అగ్ని ఐ బృందంతో కలిసి పనిచేయనుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశంలో స్టార్టప్ వ్యవస్ధను బలోపేతం చేయాలనే మా నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది. భారతదేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇన్వెస్ట్ ఇండియా మరియు అగ్ని ఐ లు మరింతగా ఒప్పో యొక్క ఎలివేట్ కార్యక్రమం వృద్ధిచేయడంతో పాటుగా ఇన్నోవేటర్లు తమ కలలను సాకారం చేసేందుకు సహాయపడనుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా, మేము భారతీయ స్టార్టప్స్ సామర్థ్యం బయటకు తీసుకురావడంతో పాటుగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో ప్రతిభను వెలికి తీసేందుకు, మానవాళికి మద్దతునందించే మరిన్ని ఆవిష్కరణలను సృష్టించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము' అని అన్నారు. ఈ కార్యక్రమం కోసం రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 25 నుంచి ప్రారంభమయ్యాయి. నవంబర్ 23 వరకూ తమ నమోదు చేసుకోవచ్చు. ఒప్పో ఇండియా వద్ద ప్రత్యేక బృందం ఈ ఎంట్రీలను సంక్షిప్తీకరిస్తుంది. డెమో డే నాడు, ఫైనలిస్ట్‌లు తమ ఆవిష్కరణలను ఒప్పో గ్లోబల్ టీమ్, సీటెల్ ఇన్నోవేషన్, విభిన్న వ్యాపారాలలోని మాడ్యుల్ లీడర్స్ నుంచి ఆవిష్కరణ మరియు పెట్టుబడుల బృందాల తో కూడిన న్యాయనిర్ణేతల వద్ద సమర్పించాల్సి ఉంటుంది. ఈ డెమో డే అనంతరం, ఈ షార్ట్‌లిస్టెడ్ స్టార్టప్స్ గుర్తించబడిన వ్యాపార విభాగాలలో మార్కెట్ సామర్థ్యం సైతం ప్రదర్శించడంతో పాటుగా వారికి ఆఫీస్ వర్క్‌స్పేస్, ఒప్పో బృందం చేత నిపుణులతో మెంటారింగ్, ఒప్పో గ్లోబల్ టీమ్స్/ఎగ్జిబిషన్స్‌తో కలిసి పనిచేసే అవకాశం మరియు ఆర్థిక మద్దతు అందిస్తారు.
ఇన్వెస్ట్ ఇండియా ఎండీ అండ్ సీఈవో దీపక్ బగ్లా మాట్లాడుతూ 'ఒప్పో లాంటి సాంకేతిక ఆవిష్కర్తతతో కలిసి పనిచేయడం పట్ల మేము చాలా ఆసక్తిగా ఉన్నాము. స్టార్టప్స్ తగిన నైపుణ్యం, అనుభవాన్పి ఒప్పో వద్ద నున్న నిపుణుల వద్ద నుంచి పొందడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు, కలలు కనే వ్యక్తులను ఆ కలలను సాకారం చేసుకునే వ్యక్తులుగా మలచాలనే మా లక్ష్యం కూడా బలోపేతం కానుంది. ఒప్పో ఎలివేట్ కార్యక్రమం, మరింతగా మా కార్యక్రమాలను వృద్ధి చేయడంతో పాటుగా భారతదేశపు ఆవిష్కరణ లక్ష్యాలను సైతం మెరుగుపరచనుంది' అని అన్నారు. ఎంపికైన స్టార్టప్స్ అపారమై ప్రయోజనాలను సైతం పొందగలరు. ఇండియా ఆర్ అండ్ డీ కేంద్రం వద్ద 5జీ, కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్స్‌ను పొందడం తో పాటుగా తమ ఉత్పత్తి అభివృద్ధి మరియు ఆలోచనల కోసం అత్యాధునిక ఒప్పో ఉపకరణాలు, పరిష్కారాలను సైతం వినియోగించేందుకు అనుమతి లభిస్తుంది. ఒప్పో ఎలివేట్ కార్యక్రమంలో భాగంగా ఈ స్టార్టప్స్ వ్యక్తిగతీకరించిన సాంకేతిక సదస్సులను సైతం పొందవచ్చు. అంతేకాదు, వారు ఒప్పో యొక్క పంపిణీ మార్గాలు, భాగస్వామ్య వ్యవస్థలపై ఆధారపడి తమ మార్కెట్ వ్యూహాలను అభివృద్ధి చేసి అమలు చేసేందుకు సైతం తగిన అవకాశాలు లభిస్తాయి.
ఒప్పో యొక్క సమగ్ర లక్ష్యంలో భాగంగా, ఈ బ్రాండ్ తమ ఒప్పో ఎలివేట్ కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా దేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను సైతం ప్రోత్సహిస్తుంది. ఇండియాను అంతర్జాతీయ ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తుంది. ఈ ప్రయత్నాలు సంస్థ యొక్క సాంకేతిక ప్రభావాన్ని విభిన్న మార్గాలు, ఫార్మాట్లలో ప్రదర్శించేందుకు తోడ్పడతాయి.