Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బెంగళూరు: భారతదేశంలో ఫిన్‌టెక్ రంగంలో అతిపెద్ద సిరీస్ ఏ ఫండింగ్లలో ఒకటిగా దాదాపు 300 కోట్ల రూపాయలను తాము సమీకరించామని ఆర్ధిక సేవల కంపెనీ జోల్వ్ వెల్లడించింది. ఈ ఫండింగ్ రౌండ్‌తో 10 నెలల వయసున్న కంపెనీ యొక్క వాల్యుయేషన్ 1575 కోట్ల రూపాయలుగా నిలిచింది. ఈ రౌండ్‌కు డీఎస్టీ గ్లోబల్ భాగస్వాములు నేతృత్వం వహించారు. ఈ సిరీస్ ఏ రౌండ్లో టైగర్ గ్లోబల్, అల్కీయాన్ క్యాపిటల్‌తో పాటుగా ప్రస్తుత మదుపరులు యాక్సెల్, లైట్ స్పీడ్ వెంచర్ పార్టనర్స్ సైతం పాల్గొన్నాయి. స్వదేశీయ క్రెడిట్ స్కోర్ ఆధారంగా జోల్వ్ ఇప్పుడు ఇమ్మిగ్రెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, విద్యార్థులకు ఎస్ఎస్ఎన్ (సోషల్ సెక్యూరిటీ నెంబర్) లేదా యుఎస్ క్రెడిట్ చరిత్ర లేకున్నా పలు ఋణ సేవలు పొందడంలో ఇది సహాయపడుతుంది. ఇప్పుడు సమీకరించిన నిధులతో అంతర్జాతీయ పౌరుల వినియోగ అనుభవాలను మెరుగుపరచనుంది. అంతేకాదు, మరిన్ని దేశాలలో సంస్థ సేవలను విస్తరించేందుకు సైతం వినియోగించనున్నారు.
‘‘మేము కేవలం 500మంది వినియోగదారులతో మా సేవలను ప్రారంభించాలనుకున్నాం. కానీ కార్యకలాపాలు ప్రారంభించిన కొద్ది వారాలలోనే 90 రెట్లు మా వినియోగదారులు పెరిగారు. మరీ ముఖ్యంగా విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మా సేవలను అధికంగా వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు సమీకరించిన నిధులతో మరింతగా మా కార్యకలాపాలను విస్తరించడంతో పాటుగా మరింత మంది ఇమ్మిగ్రెంట్స్‌కు సహాయపడనున్నాం’’ అని రఘునందన్ జి, సీఈవో అండ్ ఫౌండర్ జోల్వ్ అన్నారు.
‘‘జోల్వ్ సృష్టించే అసాధారణ విలువను ముందుగా గుర్తించిన అతి కొద్ది సంస్థలలో మేము కూడా ఒకరం కావడం పట్ల గర్వంగా ఉన్నాము. ఇమ్మిగ్రెంట్స్ కోసం పూర్తిస్థాయిలో ఆర్ధిక సేవలను ఇది అందించనుంది’’ అని అన్నారు. ‘‘యుఎస్‌తో పాటుగా ఇతర మార్కెట్లలో ఇమ్మిగ్రెంట్స్‌కు ప్రపంచ శ్రేణి ఆర్ధిక సేవల ఉత్పత్తులు మరియు అనుభవాలు అందించే జోల్వ్లో పెట్టుబడులు పెట్టనుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. జోల్వ్ యొక్క భావి విజయాల పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నాము’’ అని బెజుల్ సోమయా, పార్టనర్ , లైట్ స్పీడ్ అన్నారు.