Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సాధ్యమైనంత ఎక్కువ మందికి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో డానన్ ఇండియా, నేడు ఆప్టాగ్రో విడుదలతో, బాలల ఆరోగ్య పానీయాల విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ ఉత్పత్తి 3-6ఏళ్ల వయస్సు ఉన్న బాలల పోషకాహార అవసరాలను పరిష్కరిస్తుంది. టేస్టీ చాక్లెట్ మరియు వెనిలా ఫ్లేవర్లలో లభిస్తుంది. అప్టాగ్రో (AptaGrow)ను 37 పోషకాలతో పిల్లల కోసం శాస్త్రీయంగా డిజైన్ చేయబడిన ఆరోగ్య పానీయం కాగా, ఇది బాలల శారీరక మరియు మనో వికాసానికి ప్రత్యేకమైన ప్రీబయోటిక్స్ &డిహెచ్ఏ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేకమైన న్యూట్రీ-అబ్సార్బ్ సూత్రంతో, మెరుగైన వృద్ధికి తోడ్పడే కీలక పోషకాలను బాగా అబ్జార్బ్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది.
భారతదేశంలో, చిన్నపిల్లలు పోషకాహార లోపం, ద్వంద్వ భారంతో సమస్యలు ఎదుర్కొంటుండగా, ఇది కీలక ఎదుగుదల సమస్యలకు దారితీస్తుంది. మామ్స్ప్రెస్సో 1200 మంది పట్టణ తల్లులతో ఇటీవల నిర్వహించిన సమీక్షలో 80% మంది తల్లులు తమ బిడ్డ ఎదుగుదల గురించి ఆందోళన చెందుతున్నారని, 69% మంది తమ బిడ్డ తాము ఆశించిన స్థాయిలో ఎదగడం లేదని అభిప్రాయపడ్డారు. మరో 73% మంది తల్లులు పోషకాలను సరిగా తీసుకోకపోవడంతో తమ బిడ్డల ఎదుగుదల మరీ బలహీనంగా ఉందని విశ్వసిస్తున్నారు. సమీక్షలో వారు వ్యక్తం చేసిన మొదటి 3 ఆందోళనల్లో ఎత్తు, కండరాల వృద్ధి మరియు మానసిక వికాసం ఉన్నాయి. అప్టాగ్రోను ఎదుగుతున్న భారతీయ బాలల పోషకాహార అవసరాలకు అనుగుణంగా తయారు చేశారు. దీనిలో ఇందులో 100% పాల ప్రోటీన్ మరియు కాల్షియం, ఎత్తు పెరిగేందుకుప్రీబయోటిక్స్ మరియు విటమిన్ ఎ, సి, డిలు రోగనిరోధక ఆరోగ్యానికి మరియు డిహెచ్ఏ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ &అయోడిన్ మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి. ఈ కొవ్వు తక్కువ ఉండే ఈ పానీయం బాలలు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సహకరిస్తుంది. ఇది రుచికరమైన చాక్లెట్/వెనిల్లా రుచులతో పోషకమైన ఆరోగ్య పానీయాన్ని సరైన ఎంపికగా చేస్తుంది.
ఆప్టాగ్రోను విడుదల చేసిన సందర్భంలో డానన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు బక్షి మాట్లాడుతూ, “డానన్లో, జీవితంలోని ప్రతి దశలోనూ వినియోగదారుల పోషకాహార అవసరాలు మరియు అంచనాలకు అనుగుణంగా ఉత్పత్తులను మరియు సేవలను ఆవిష్కరించి అందించడమే మా లక్ష్యం. దీన్ని విడుదల చేయడం ద్వారాచిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పానీయాన్ని సేవించే అలవాట్లకు మద్దతు ఇవ్వడమే మా లక్ష్యం. ఎందుకంటే చిన్న వయసులో పునాదిగా ఉండే ఇటువంటి అలవాట్లు తదుపరి జీవితంలో వారి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అప్టాగ్రో ఎదిగే పిల్లల పోషక అవసరాలను తీర్చేందుకు శాస్త్రీయంగా డిజైన్ చేయబడింది మరియు తమ పిల్లల పోషకాహారం తీసుకోవడం గురించి వారి తల్లుల ఆందోళనలను అది పరిష్కరిస్తుంది’’ అని వివరించారు.
ఆప్టాగ్రో విడుదలతో, డానన్ ఇండియా భారతదేశంలోని పిల్లల కోసం అందుబాటులో ఉన్న రూ.650 కోట్ల విలువైన ఆరోగ్య పానీయాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఆప్టాగ్రో త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్‌లలోని ప్రముఖ ఆధునిక ట్రేడ్ స్టోర్లు, స్థానిక దుకాణాలు, ఫార్మసిస్టులు& అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫార్మ్ఈజీ తదితర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారాల్లో 400 గ్రాముల సైజ్ ప్యాక్‌లలో లభిస్తుంది.