Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వచ్చే నవంబర్ ఒక్కటో తేదిన పిబి ఫిన్టెక్ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానుంది. పాలసీబజార్, పైసా బజార్ పేరుతో ఆన్లైన్లో పలు సంస్థల బీమా, రుణ ప్లాన్లను ఒకే వేదికపై అందించే ఈ ఫిన్టెక్ తొలి ఇష్యూలో రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్ ధరల శ్రేణీని రూ.940 రూపాయల నుంచి రూ.980గా నిర్ణయించింది. ఈ ఐపిఒను నవంబర్ 3న మూసివేస్తారు. కనీసం 15 ఈక్విటీ షేర్లతో బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో ఆ కంపెనీ రూ.5,700 కోట్ల నిధుల సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.