Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ2 లాభాల్లో 65 శాతం పతనం
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయరీ కంపెనీ మారుతి సుజుకి నికర లాభాలు అంచనాలు మించి క్షీణించాయి. చిప్‌ల కొరత ఆ కంపెనీ ఉత్పత్తిని ప్రభావితం చేయడంతో అమ్మకాలూ తగ్గాయి. ఈ పరిణామాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 65.35 శాతం పతనంతో రూ.475.30 కోట్ల లాభాలకు పరిమితమయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,371.60 కోట్ల లాభాలు ఆర్జించింది. క్రితం క్యూ2లో ఈ కంపెనీ రూ.700 కోట్ల పైగా లాభాలు ఆర్జించే అవకాశం ఉందని పలు సంస్థలు అంచనా వేశాయి. దీంతో పోల్చితే భారీ తగ్గుదల చోటు చేసుకున్నట్లయ్యింది. కంపెనీ అమ్మకాలు 9.09 శాతం పెరిగి రూ.19,297.80 కోట్లుగా నమోదయ్యాయి. ఎలక్ట్రానిక్ చిప్‌ల కొరతతో 1.16 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయామని ఆ కంపెనీ తెలిపింది. గడిచిన త్రైమాసికంలో మొత్తంగా 3,93,130 యూనిట్లను అమ్మకాలు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ2లో 3,70,619 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.