Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ముంబై: ఎలక్ట్రికల్ కన్ స్ట్రక్షన్ మెటీరియల్స్ (ఈసీఎం) అతి పెద్ద తయారీ సంస్థల్లో ఒకటైన పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా తన ప్రీమియం స్విచ్ గేర్ తాజా శ్రేణిని ప్రకటించింది. ఇది నాణ్యత కోరుకునే భారతీయ వినియోగదారుల కోసం రూపొందించిన భద్రత ఉపకరణాల అధునాతన శ్రేణి. నూతన ‘యూఎన్ఒ ప్లస్’ శ్రేణి లో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ), రెసిడ్యుయల్ కరెంట్ ఆపరేటెడ్
సర్క్యూట్ బ్రేకర్ (ఆర్ సీసీబి), డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ ఉన్నాయి. అత్యధిక స్థాయిలో ఏడేళ్ళ వారంటీతో ఈ శ్రేణి లభిస్తుంది. ఎంసీబీల (0.5A నుంచి 63A) పై ఇంత ఎక్కువ కాలం వారంటీ ఇవ్వడం దేశంలో ఇదే మొదటిసారి. ఇది మాత్రమే గాకుండా యూఎన్ఒ ప్లస్ శ్రేణి 10 కెఎ విభాగంలో మరెన్నో విశిష్టతలను కలిగిఉంది.
ఈ సందర్భంగా పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కజుకి యావో మాట్లాడుతూ, ‘‘భద్రమైన, సురక్షితమైన, నాణ్యమైన ఉత్పాదన పోర్ట్ ఫోలియోను నిర్మించుకోవాలనే మా ఆకాంక్షను తీ ర్చుకోవడంలో యూఎన్ఒ ప్లస్ ను ప్రవేశపెట్టడం ఓ గణనీయ మైలురాయి. భారతీయ మార్కెట్ లో మా అంతర్జాతీయ నైపుణ్యాన్ని చాటుకోవాలని, మా పోర్ట్ ఫోలియోను సుసంపన్నం చేసుకోవవాలని మొదటి నుంచి కూడా మేం భావిస్తున్నాం. అందుకు అనుగుణంగానే ఈ నూతన శ్రేణి రూపుదిద్దుకుంది. యూఎన్ఒ ప్లస్ శ్రేణి జపనీస్ సాంకేతికతతో అత్యుత్తమ జపనీస్, భారతీయ భావనలతో అభివృద్ధి చేయబడింది. ఈ ఆవిష్కరణతో, మా వినూత్న ఉత్పాదనలను మెట్రోలకు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు మరింతగా విస్తరించడం, దేశవ్యాప్తంగా ఉనికి చాటుకోవడం, నూతన ప్రాంతాల్లో మా మార్కెట్ వాటా పెంచుకోవడం మా లక్ష్యం. భారతదేశ అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ ఉత్పాదన హరిద్వార్ లోని ఆత్మనిర్భర్ భారత్ కేంద్రంలో తయారవుతుంది’’ అని అన్నారు.
ఈ సందర్భంగా పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ అగర్వాల్ మాట్లాడుతూ. ‘‘పానసోనిక్ లో మేం ఎప్పుడూ, మరింత మెరుగ్గా చేయడాన్ని విశ్వసిస్తాం. అది మమ్మల్ని వినియోగదారులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, అత్యుత్తమ సేవలు, పరిష్కారాలు అందించేలా చేసింది. సురక్షితను కోరుకునే వినియోగదారులు, భవన నిర్మాతలు, ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్లు, నాణ్యమైన ఉత్పాదన లను తక్షణమే ఇన్ స్టాల్ చేయాలనుకునే వారిని మేం లక్ష్యంగా చేసుకున్నాం. ఈ సరికొత్త యూఎన్ఒ ప్లస్ స్విచ్ గేర్ సిరీస్ ఎంతగానో సురక్షితను, భద్రతను అందించేలా, అదే సమయంలో నాణ్యతను, డిజైన్ ను కలిగిఉండేలా, చక్కటి రౌండెడ్ ఫినిష్ ను అందించేలా రూపొందించబడ్డాయి. అందరికీ అనువుగా ఇవి తయారయ్యాయి. మార్కెట్ స్పందన కోసం మేం వేచి చూస్తున్నాం. ఆవిష్కరణ కంటే ముందుగానే ఆర్డర్లు పొందిన మొదటి ఉత్పాదన ఇది’’ అని అన్నారు.
పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా అన్ని కస్టమర్ విభాగాల్లో కూడా భారతదేశంలో ఎదుగుదలకు, అభివృద్ధికి కట్టుబడి ఉంది. కంపెనీ పరిశోధన, అభివృద్ధిలో సుమారుగా రూ.30 మిలియన్లను పెట్టుబడిగా పెట్టింది. స్విచ్ గేర్ ప్రొటెక్షన్ ఉపకరణాల కోసం అత్యంత అధునాతన యంత్రాలను కలిగిఉంది. భారతదేశం లోని హరిద్వార్ లో తయారీ కేంద్రాన్ని కలిగిఉంది. ప్రస్తుతం ఈ ఉత్పాదన దేశంలోని మధ్య, దక్షిణ ప్రాంతా ల్లో అందుబాటులో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి తూర్పు, పశ్చిమ, ఉత్తర భారతదేశాల్లో అందుబాటులోకి రానుంది.
మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ):
- గరిష్ఠ భద్రత: విద్యుత్ ఉపకరణాలకు రెండు రకాల ఫాల్ట్ లకు సంబంధించి, అత్యంత విశ్వసనీయ తతో గరిష్ఠ భద్రతను అందించేలా ఎంసీబీ శ్రేణి రూపొందించబడింది.
1) ఓవర్ లోడ్ ఫాల్ట్ ప్రొటెక్షన్ - ఇది ఓవర్ లోడ్ పరిస్థితుల్లో ఓవర్ కరెంట్ నుంచి విద్యుత్ ఉప కరణాలకు రక్షణ కల్పిస్తుంది.
2) షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ ప్రొటెక్షన్ – అధునాతన సర్క్యూట్ బ్రేకర్లను ఉపయోగించడం ద్వారా షార్ట్ స ర్క్యూట్ ఫాల్ట్ నుంచి ఆవరణలు కాపాడబడేలా ఇది రూపుదిద్దుకుంది. ఫాల్టీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ యొక్క ఓవర్ కరెంట్ కారణంగా చోటు చేసుకునే షార్ట్ సర్క్యూట్స్ నుంచి ఇది కాపాడుతుంది.
- డిజైన్ ఉత్కృష్టత: అత్యున్నత స్థాయి ఇంజినీరింగ్ ప్లాస్టిక్ తో డిజైన్ చేయబడి తయారైంది. ఈ శ్రేణి అసాధారణ హీటింగ్ ను నిరోధిస్తుంది. విశ్వసనీయ మెకానిజంతో బలమైన ప్రభావాలను నిరోధిస్తుంది.
- లైన్ లోడ్ రివర్సిబిలిటీ, సేఫ్టీ షట్టర్లు, 35SQmm సైజు పెద్ద టెర్మినల్, బ్రీతింగ్ ఛానెల్లు, అధిక శక్తి సామర్థ్యం, Rohs మరియు CE అనుగుణతతో కూడిన లేబుల్ సూచికలు అత్యధిక భద్రత, సంస్థాపనల సౌలభ్యాన్ని అందిస్తూ ఈ ఉత్పత్తిని ఈ తరగతిలో ఉత్తమమైనదిగా చేస్తాయి.
రెసిడ్యుయల్ కరెంట్ ఆపరేటెడ్ సర్క్యూట్ బ్రేకర్ (ఆర్ సిసిబి):
డైరెక్ట్ కాంటాక్ట్స్ లేదా ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్స్ కారణంగా రెసిడ్యుయల్ కరెంట్స్ ఏర్పడే సందర్భాల్లో తట్టుకునేలా యుఎన్ఒ ప్లస్ ఆర్ సిసిబి అత్యంత విశ్వసనీయతతో డిజైన్ చేయబడింది.
- డిస్ కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేయబడింది: సప్లయ్ మెయిన్స్ నుంచి ఎలక్ట్రికల్ లోడ్ ను డిస్ కనెక్ట్ చేసేలా అత్యంత విశ్వసనీయతతో ఆర్ సిసిబి డిజైన్ చేయబడింది. ఇది డైరెక్ట్ కాంటాక్ట్స్ లేదా ఇన్ డైరె క్ట్ కాంటాక్ట్స్ కారణంగా ఏర్పడే రెసిడ్యుయల్ కరెంట్స్ నుంచి మనుషుల ప్రాణాలను కాపాడుతుంది.
- మనుషుల ప్రాణాలను కాపాడేందకు గాను సాధారణ ఇంటి అవసరాలకు 30 ఎంఎఐఎస్ తో కూడిన యూఎన్ఒ ప్లస్ ఆర్ సిసిబి ఉపయోగించబడుతుంది.
- రెసిడ్యుయల్ కరెంట్స్ నుంచి మనుషుల ప్రాణాలను కాపాడేందుకు గాను 100 ఎంఎ నుంచి 300 ఎంఎ తో కూడిన యూఎన్ఒ ప్లస్ ఆర్ సిసిబి పారిశ్రామిక లోడ్స్ ఉపయోగించబడుతుంది.
యూఎన్ఒ ప్లస్ ఆర్ సిసిబి బై కనెక్ట్ టర్మినేషన్, లార్జర్ టర్మినల్ సైజ్, Rohs, CE అను గుణతతో విజువల్ ఆన్ / ఆఫ్ ఇండికేషన్ తో లభిస్తుంది.
డిస్ట్రిబ్యూషన్ బోర్డులు (డిబి):
- చక్కటి డిజైన్ తో కూడిన రక్షణ: డిస్ట్రిబ్యూషన్ బోర్డులు రక్షణ అందించే నూతన దృక్పథంతో రూపొందించబడ్డాయి. స్టయిలిష్ కలర్, చక్కటి డిజైన్ తో ఏ ఇంటీరియర్ అలంకరణకైనా అనువుగా ఉంటుంది.
- సరళత్వం, సురక్షిత: యుఎన్ఒ ప్లస్ డిబి సరళత్వం, సురక్షితల ప్రయోజనాలను అందిస్తుంది. ఎలక్ట్రిక్ పవర్ సురక్షిత, సామర్థ్యపూరిత డిస్ట్రిబ్యూషన్ కు వీలు కల్పిస్తుంది. తుప్పు పట్టని స్వభావం, అత్యున్నత స్థాయి ఫినిష్, ప్రీమియం నాణ్యత, అత్యాధునిక టెక్నిక్స్ తో యూఎన్ఒ ప్లస్ డిబి అనేది ఇళ్లకు, కార్యాలయాలకు, పరిశ్రమలకు చక్కటి ఎంపికగా ఉంటుంది. ఐపి 43, ఐపి 54 అనుగుణ్యత దీన్ని దుమ్ము, నీటి నిరోధకంగా చేస్తుంది. ఐకె09 అనేది ఇంపాక్ట్ నిరోధకతను అందిస్తుంది.