Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఫిన్‌టెక్ రంగంలో అతిపెద్ద సిరీస్ ఏ ఫండింగ్లలో ఒకటిగా తాము రూ.300 కోట్ల నిధులను సమీకరించామని ఆర్ధిక సేవల కంపెనీ జోల్వ్ వెల్లడించింది. ఈ ఫండింగ్ రౌండ్‌తో 10 నెలల వయసున్న తమ కంపెనీ విలువ రూ.1575 కోట్లకు చేరిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రౌండ్‌కు డిఎస్టి గ్లోబల్ భాగస్వాములు నేతత్వం వహించారని తెలిపింది. ఈ సిరీస్ ఏ రౌండ్లో టైగర్ గ్లోబల్, అల్కీయాన్ క్యాపిటల్‌తో పాటుగా ప్రస్తుత మదుపరులు యాక్సెల్, లైట్ స్పీడ్ వెంచర్ పార్టనర్స్ సైతం పాల్గొన్నాయని వెల్లడించింది.