Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) డైరెక్టర్ (మార్కెటింగ్)గా వి సతీష్ కుమార్ (56) బాధ్యతలు స్వీకరించారు. ఇంతక్రితం ఆయన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు వ్యాపార అధిపతిగా ఉన్నారు. రిటైల్, డైరెక్ట్ సేల్స్, ఎల్పీజీ, ల్యూబ్ అమ్మకాలు, ఆపరేషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్లానింగ్, హెచ్ఆర్డీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పర్యవేక్షించేవారు. దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాలలో పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్‌లో మూడు దశాబ్దాలకు పైగా నైపుణ్యాన్ని బోర్డుకి తీసుకువచ్చారు.