Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత రైల్వేస్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ తెలిపింది. రైల్వే ప్రయాణీకులకు కమ్యూనికేషన్ విషయంలో మరింత నమ్మకాన్ని అందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఆ సంస్థ పేర్కొంది. దీంతో రైల్వే ప్రయాణికులు పలు గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఎస్ఎమ్ఎస్లకు చెక్ పెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఐఆర్సీటీసీ నుంచి సమాచారాన్ని ట్రూకాలర్ యాప్ గుర్తించి ధవీకరించబడిన ఎస్ఎమ్ఎస్ అంటూ ట్రూకాలర్ యూజర్లకు నోటిఫికేషన్ ఇస్తుందని తెలిపింది. రైల్వే ప్రయాణికులకు పటిష్టమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో ట్రూకాలర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఆర్సీటీసీ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా పేర్కొన్నారు.