Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: పరిశోధనని ప్రోత్సహించడానికి మరియు సామాజిక సంక్షేమం కోసం యువత టెక్నాలజీని ఉపయోగించడానికి వీలు కల్పించడాన్ని శామ్ సంగ్ ఇండియా శామ్ సంగ్ ఫెలోషిప్ అవార్డ్ ని తమ సిటిజన్ షిప్ ప్రోగ్రాం శామ్ సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్ ని శామ్ సంగ్ ఇండియా ఆరంభించింది. ఈ చొరవ తమ కల పవరింగ్ డిజిటల్ ఇండియా కల దిశగా శామ్ సంగ్ వారి నిబద్ధతని బలోపేత్తం చేసింది.
ఐఐటీ మద్రాస్, ఐఐటీ గౌహతీలలో 100 మంది అండర్ గ్రాడ్యుయేట్ మరియు 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శామ్ సంగ్ ఫెలోషిప్స్ ఇచ్చింది. ట్రాఫిక్ అంచనా మరియు ట్రాఫిక్ లైట్స్ డైనమిక్ నియంత్రణ, యాంటీ-కాన్సర్ డ్రగ్ పరిశోధన, ఎలక్ట్రిక్ వాహనాలు కోసం విద్యుచ్ఛక్తి మరియు సౌర కణాలలో ద్రవం క్రిస్టల్స్ నిర్వహణకు ఇంట్రూజన్ గుర్తింపు సిస్టం వంటి తమ ప్రాజెక్టులలో ఎంచుకోబడిన విద్యార్థుల్ని ఫెలోషిప్ మద్దతు చేస్తుంది.
చివరి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు, బీ.టెక్, డ్యూయల్ డిగ్రీ (బీ.టెక్+ ఎం.టెక్) మరియు ఎం.టెక్ /ఎం.ఎస్. (పరిశోధన) చేస్తున్న విద్యార్థులు మరియు సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ ఉత్పత్తులకు దారితీసే ప్రాజెక్ట్ పై పని చేస్తున్న వారు ఫెలోషిప్ కోసం అర్హులు. బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంజనీరింగ్ లో ఏదైనా శాఖలో వారు 6కి పైగా సంచిత గ్రేడ్ ని కలిగి ఉండాలి. శామ్ సంగ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రతి నెల ఐఎన్ఆర్ 6,000 మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రతి నెల ఐఎన్ఆర్ 25,000 కేటాయిస్తుంది.
"శామ్ సంగ్ ఆర్ &డీ ఇన్ స్టిట్యూట్ ఇండియా, ఢిల్లీ ఐఐటీలలో ఉన్న ముఖ్యంగా సమాజంలో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులలో పరిశోధన, ఆవిష్కరణల్ని మెరుగుపరిచే దిశగా పని చేస్తోంది. శామ్ సంగ్ ఫెలోషిప్ ద్వారా, సామాజిక శ్రేయస్సు కోసం తమ సామర్థ్యాల్ని వినియోగించడానికి రాబోయే తరాలకి సాధికారత కలిగించాలని మేము కోరుకుంటున్నాము. రాబోయే సంవత్సరాలలో ఈ ఫెలోషిప్ ని మేము మరిన్ని ఐఐటీలకు ఈ ఫెలోషిప్ ని విస్తరించాలని ప్రణాళిక చేస్తున్నాము,"అని డియోఖో కిమ్, మేనేజింగ్ డైరక్టర్, శామ్ సంగ్ రీసెర్చ్ &డవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్, ఢిల్లీ చెప్పారు.
శామ్ సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రధాన అధికారి, కార్పొరేట్ సిటిజన్ షిప్, పార్థా ఘోష్ మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత మెరుగైన విద్యా, సాధనా అవకాశాల్ని మా సిటిజన్ షిప్ కల టుగెదర్ ఫర్ టుమారో! ఎనేబ్లింగ్ పీపుల్ లో భాగంగా సంపాదించేలా శామ్ సంగ్ సహాయపడుతోంది. విద్యార్థులు తమ ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్లి మరియు గొప్ప శ్రేయస్సు కోసం ఆవిష్కరణల్ని అభివృద్ధి చేయడానికి కొత్త శామ్ సంగ్ ఫెలోషిప్ సహాయపడుతుంది. యువ భారతదేశం యొక్క ఆధునిక తరానికి సాధికారత కలిగించడాన్ని కోరుకునే పవరింగ్ డిజిటల్ ఇండియా యొక్క మా కల యొక్క స్వరూపం ఈ చొరవ" అని అన్నారు.
ఇప్పటి వరకు ఇచ్చిన 130 ఫెలోషిప్స్ కెమికల్, మెకానికల్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఓషన్, సీఎస్ఈ, ఇంజనీరింగ్ డిజైన్, సివిల్, మెటలర్జికల్, మెటీరియల్స్, ఏరోస్పేస్ మొదలైన వాటితో సహా వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇవ్వబడ్డాయి.
శామ్ సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్ అనేది కంపెనీ వారి అంతర్జాతీయ సిటిజన్ షిప్ కార్యక్రమం. ఇది ఐఓటీ, పర్వేజివ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, ఏఆర్/వీఆర్, ఇతరాలలో ఆధునిక టెక్నాలజీలు పై నైపుణ్యమున్న విద్యార్థులు ద్వారా దేశంలో నైపుణ్యంలో ఉన్న అంతరాల్ని తీర్చే లక్ష్యాల్ని కలిగి ఉంది. ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-హైదరాబాద్, ఐఐటీ- ఖరగ్ పూర్, ఐఐటీ-రూర్కీ, ఐఐటీ-గౌహతి, ఐఐటీ-జోధ్ పూర్, ఎన్ ఎస్ యుటీ, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ (డీటీయూ)లలో శామ్ సంగ్ కి ప్రస్తుతం తొమ్మిది శామ్ సంగ్ ఇన్నోవేషన్ కాంపస్ లు ఉన్నాయి. ఇప్పటి వరకు, ఈ ప్రయోగశాలలు 1,000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది.