Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ప్రముఖ అభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యువెల్లర్స్ 150 స్టోర్లకు విస్తరించింది. ఈ నూతన స్టోర్‌ను నోయిడాలో ఏర్పాటు చేసింది. ఈ ప్రారంభోత్సవంలో కల్యాణ్ జ్యువెల్లర్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టిఎస్ కళ్యాణరామన్, ఆ సంస్థ బ్రాండ్ అంబాసీడర్స్ వామిక గబ్బి, మంజు వారియర్, రితభరి చక్రబర్తి పాల్గొన్నారు. ''ఈ రోజు మాకు ఎంతో ప్రత్యేకం. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో 150వ స్టోర్‌ను తెరవడం ద్వారా నూతన మైలురాయిని నెలకొల్పాము. మా వినియోగదారుల నగదుకు తగ్గ గరిష్ట లాభాలను చేకూర్చుతాము. కీలక మార్కెట్లలో మా విస్తరణ ప్రణాళికలు కొనసాగుతాయి'' అంటూ కళ్యాణరామన్ పేర్కొన్నారు.