Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రిలయన్స్ జియో తన 4జి నెక్ట్స్ ఫోన్ ధరను అంచనాల కంటే పెంచేసింది. శుక్రవారం అధికారింగా దీని ధరను రూ.6,499గా ప్రకటించింది. కాగా.. దీన్ని రూ. 1,999 చెల్లించి సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. వాస్తవానికి ఈ ఫోన్ రూ.3000 లోపు ఉంటుందని తొలుత పలు రిపోర్టులు వచ్చాయి. ఈ ధరను రెండింతలు చేయడం కొనుగోలుదారుల్లో నిరాశను పెంచింది. తొలుత రూ.1999 చెల్లించి ఫోన్‌ను తీసుకున్న తర్వాత వాయిదాల పద్ధతిలో మిగతా సొమ్మును 18 లేదా 24 మాసాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఎంచుకున్న ఈఎంఐ కాలపరిమితి, ప్లాన్‌ను బట్టి నెలకు రూ.300 నుంచి 600 మేర చెల్లించాల్సి ఉంటుంది. ఈఫోన్లు రిలయన్స్ డిజిటల్ రిటైల్ స్టోర్లలో దేశవ్యాప్తంగా ఫోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గూగుల్ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్థి చేసిన విషయం తెలిసిందే. ఇందులో క్వాల్కామ్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 13 ఎంపీ రియర్ కెమెరా, ఫ్లాష్ లైట్‌తో కూడిన సెల్ఫీ కెమెరా, గూగుల్, జియో యాప్స్‌తో దీన్ని ఆవిష్కరించారు.