Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020-21కి గాను కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)కి గాను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో ఈ వడ్డీని ఖాతాదారుల ఖాతాలకు దీపావళి నాటికి జమ చేసే అవకాశం ఉందని కార్మిక శాఖ కార్యదర్శి సునీల్ భరత్వాల్ తెలిపారు. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి శుక్రవారం ఆమోదం లభించిందన్నారు. అతి త్వరలోనే నోటిఫై చేయనున్నామన్నారు. ఈ సంస్థలో ప్రస్తుతం 6 కోట్ల పైగా ఉద్యోగ, కార్మికులు నమోదై ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ రూ.70,300 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా 8.5 శాతం వడ్డీ రేటునే అందించారు.