Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: `ఆత్మ నిర్భర్ భారత్ `కు ప్రతిరూపంగా నిలిచిన ప్రమా ఇండియా సంస్థ గురించిన సమాచారాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖామంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన తొమ్మిదో ట్రాఫిక్ ఇన్ ఫ్రాటెక్ ఎక్స్ పో 2021లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోని ప్రముఖ స్వదేశీ వీడియో సెక్యూరిటీ బ్రాండ్ ‘ప్రమా’పై రూపొందిన ప్రత్యేక స్మారక పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. అనంతరం వేదికపై ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ కోసం ‘మేక్-ఇన్-ఇండియా’ విజన్‌ను గుర్తు చేసుకున్నారు. ప్రమాపై విడుదలైన పుస్తకంలో నిక్షిప్తమైన స్పూర్తిదాయక కథలను, స్వావలంబనకై సంస్థ చేసిన కృషిని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తద్వారా స్థానికంగా కృషి చేస్తున్న సంస్థలకు ప్రోత్సాహాన్ని అందించినట్లవుతుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా భారత్ లో చేపట్టిన 'ఆత్మనిర్భర్ భారత్స అనే నినాదానికి ప్రత్యక్ష రూపం ప్రమా అని కొనియాడారు.
రవాణా భద్రత, ట్రాఫిక్, స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో రవాణా రంగానికి సంబంధించిన తాజా సాంకేతికతలు, ఉత్పత్తులు మరియు పరిష్కారాలను ప్రదర్శించడానికి ప్రమా ఇండియా ట్రాఫిక్ ఇన్ ఫ్రా టెక్ ఎక్స్ పో 2021లో పాల్గొనడం విశేషం. ప్రమా ఇండియా రవాణా విభాగాలతో సహా వివిధ అవసరాల కోసం దేశీయంగా, సరికొత్తగా తయారు చేయబడిన ఉత్పత్తులను అందిస్తున్నది. తమ బ్రాండ్ ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టిస్తూనే, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందిస్తూ భారతదేశం గర్వించదగిన వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. భద్రత, నిఘా ఉత్పత్తులలో భారత్ ప్రత్యేకమైన దేశంగా ప్రపంచపటంలో నిలవాలనే ఉద్దేశంతో సంస్థ నాణ్యమైన, అత్యుత్తమమైన, అత్యాధునిక సాంకేతికత వంటి అంశాలతో మిళితమైన ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను రూపుదిద్దుకునేందుకు సంస్థ గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. భారతదేశపు విస్తారమైన రవాణా రంగం సరికొత్త స్మార్ట్ మొబిలిటీ ట్రెండ్లు, వినూత్న భద్రతా పరిష్కారాలతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రవాణా పర్యావరణ వ్యవస్థలో కీలకమైన వాటాదారులకు తాజా సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించేందుకు ట్రాఫిక్ఇన్ఫ్రాటెక్ ఎక్స్పో సంబంధిత వేదికగా కొనసాగుతోంది. హైవే, మెట్రో, విమానాశ్రయం, పోర్ట్‌ల కోసం సరికొత్త రవాణా పరిష్కారాలను ఎక్స్ పోలో ప్రమా తరఫున లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్, పబ్లిక్ సేఫ్టీ, లా ఎన్ఫోర్స్మెంట్ మరియు ‘ఇన్ వెహికల్ మానిటరింగ్’ సిస్టమ్ కోసం సొల్యూషన్లు ప్రదర్శించబడ్డాయి.
వీడియో భద్రతా ఉత్పత్తుల కోసం ప్రపంచ మ్యాప్‌లో భారతదేశాన్ని ఉంచాలనే ప్రధాన నమ్మకంతో స్థాపించబడిన ప్రమా భారతదేశంలోనే అతిపెద్దది కావడం విశేషం. ఇంకా 'ఆత్మనిర్భర్ భారత్' నినాదాన్ని నిజంగా సూచించే తొలి సంస్థలలో ఇది ఒకటని చెప్పవచ్చు. స్వదేశీ బ్రాండ్, ప్రమా 'మేడ్ ఫర్ ఇండియా, మేడ్ బై ఇండియా, మేడ్ ఇన్ ఇండియా` అనే నినాదానికి అనుగుణంగా పని చేస్తున్న సంస్థ. అన్ని భద్రతా అవసరాలను తీర్చే అధిక నాణ్యత గల వీడియో భద్రతా ఉత్పత్తులను తయారు చేసే సంస్థలలో అగ్రగామా ప్రమా. భారత ప్రభుత్వం నినాదమైన ‘మేక్-ఇన్-ఇండియా’ చొరవతో ప్రోత్సాహకాన్ని అందుకున్న ప్రమా ఇండియా భారతదేశం నుంచి మొట్టమొదటి ప్రపంచ స్థాయి తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. భారతదేశాన్ని వీడియో భద్రతా ఉత్పత్తుల కోసం ప్రపంచ తయారీ, ఎగుమతి హబ్‌గా మార్చడంలో సహాయపడుతుంది. వీడియో భద్రతా ఉత్పత్తుల స్వదేశీ తయారీ ద్వారా భారతదేశానికి సాధికారత కల్పించడానికి కంపెనీ నిబద్ధతను కలిగి ఉంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ పరిష్కారాలను ఆవిష్కరించడానికి, నవీకరించడానికి ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికత, పురోగతిని దృష్టిలో ఉంచుకుని దీని R&D కేంద్రం అభివృద్ధి చేయబడింది.