Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆరవ తరగతి నుంచి 12 వ తరగతి విద్యార్థుల కోసం రూపకల్పన చేసిన భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పీరియన్షల్ యాప్ ప్రాక్టికల్లీ ఇప్పటి వరకు 10 లక్షల డౌన్లోడ్లను నమోదు చేసినట్లు తెలిపింది. గడిచిన సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు మూడు రెట్ల వృద్థి చోటు చేసుకుందని పేర్కొంది. ఇటీవల తమ యాప్ టాప్ 10 విద్యా యాప్‌లలో ఒకటిగా నిలిచిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వినూత్నమైన ఫీచర్ల ద్వారా విద్యార్థులు లీనమయ్యే విషయాంశాలు, అభ్యాస అనుభవాలను ప్రాక్టికల్లీ అందిస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు, సిఒఒ చారు నోహారియా తెలిపారు.