Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ప్రపంచవ్యాప్తంగా తమకు సహకరించిన సిబ్బందికి ధన్యవాద సూచకంగా ఆర్థిక బహుమతిని అందచేయనున్నట్లుగా ఐకియా స్టోర్స్ మాతృసంస్థ ఇంగ్ కా గ్రూప్ తెలిపింది. ఉప్స్కట్ట పేరుతో 110 మిలియన్ యూరోల (దాదాపు రూ.953 కోట్లు) విలువ చేసే ప్రశంసాపూర్వక బహుమతిని సిబ్బందికి ఇస్తున్నట్లు పేర్కొంది. అంతా కలసి పని చేసేందుకు, ఘన విజయాలను వేడుక చేసుకునేందుకు మా పటిష్ఠమైన ఐకియా సంస్కతికి, అత్యుత్తమ విధానాలను పాటించడానికి ఇదో అవకాశమని తెలిపింది. ఇంగ్కా గ్రూప్ 32 దేశాల్లో 1.70 లక్షల పైగా ఉద్యోగులను కలిగి ఉంది.