Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో పన్ను వసూళ్లు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుత ఏడాది అక్టోబర్లో జీఎస్టీ వసూళ్లు 24 శాతం పెరిగి రూ.1.3 లక్షల కోట్లకు చేరాయి. 2017లో జిఎస్టి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది రెండో సారి అత్యధిక మొత్తం వసూలు. ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డ్ స్థాయిలో రూ.1.40 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. ప్రస్తుతం సానుకూల పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్థంలో జిఎస్టి వసూళ్లు బాగుంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.