Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ విధానాలతో దేశంలో అసంఘటిత రంగం వాటా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎకనామిక్ రీసెర్చ్ డిపార్టుమెంట్ తాజా రిపోర్ట్‌లో తెలిపింది. గడిచిన మూడేళ్లలో ఈ రంగం ఆర్థిక వ్యవస్థ 15-20 శాతానికి దిగివచ్చిందని వెల్లడించింది. డిజిటలైజేషన్, కరోనా సంక్షోభం ఆర్థిక వ్యవస్థలో వేగమైన మార్పులు తీసుకొచ్చాయని పేర్కొంది. ఈ క్రమంలోనే 2020-21 నాటికి జిడిపిలో అసంఘటిత రంగ ఆర్థిక వ్యవస్థ 15-20 శాతానికి తగ్గిందని తెలిపింది. 2017-18లో ఇది 52 శాతంగా ఉందని ఎస్బీఐ గ్రూపు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. గత కొన్ని ఏళ్లలో పలు పద్దతులు, విధానాలు, పథకాల ద్వారా సంఘటిత ఆర్థిక వ్యవస్థలోకి రూ.13 లక్షల కోట్ల నిధులు వచ్చినట్లు ఈ రిపోర్ట్ తెలిపింది.