Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మొబైల్ రిటైల్ రంగంలో దూసుకుపోతున్న బిగ్'సి' దీపావళి సందర్బంగా తమ వినియోగదారులకు వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 250కి పైగా స్టోర్స్‌తో విక్రయాల్లో దూసుకుపోతున్నామని ఆ సంస్థ సిఎండి యం బాలు చౌదరి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీపావళి సందర్బంగా మొబైల్ కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాలు తదితర రాయితీలు కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా ప్రతీ మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి అందిస్తున్నట్లు వెల్లడించారు. పలు విత్త సంస్థ కార్డుల చెల్లింపులపై రూ.3500 వరకు క్యాష్ బ్యాక్, పలు కంపెనీల మొబైల్లపై ఇన్స్టాంట్ డిస్కౌంట్ కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా స్మార్ట్ టివిల కొనుగోలుపై రూ.3500 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నామన్నారు.