Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎస్పీబీటీ కాలేజీ వద్ద నిర్వహించిన ఓ వేడుకలో వ్యాపార సమీక్షా సమావేశంతో పాటుగా విజిలెన్స్ అవగాహన వారోత్సవంను సైతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సురేష్ పటేల్ హాజరయ్యారు. బ్యాంకుకు చెందిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పరుశురామ్ పాండా, పలువురు బ్యాంకు అధికారులతో కలిసి ఆయనకు స్వాగతం చెప్పడంతో పాటుగా ఈ అవగాహన వారోత్సవంలో భాగంగా చేపట్టిన పలు కార్యక్రమాలను గురించి ఆయనకు వెల్లడించారు. ఇండిపెండెంట్ ఇండియా ఎట్ 75 స్వాలంబన, సమగ్రత అనే నేపథ్యానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా తాము ప్రారంభించిన అవగాహన కార్యక్రమాలను గురించి సైతం వారు ఈ సమావేశంలో ప్రస్తావించారు.
ఈ కార్యక్రమ గౌరవ అతిథి సీవీసీ సురేష్ పటేల్ ఈ సంవత్సర నేపథ్యం గురించి మాట్లాడటంతో పాటుగా తన సొంత బ్యాంకింగ్ అనుభవాలను గురించి సైతం వెల్లడించారు. నిజాయితీ, సమగ్రత, హార్డ్ వర్క్, సానుకూల ధృక్పథంతో సంస్థలో పలు స్థాయిల్లో విజయం సాధించవచ్చని తెలిపారు. ఈ క్రమంలోనే అన్ని స్థాయిల్లోనూ ప్రతి వ్యక్తి నిబంధనలను ఖచ్చితంగా అనుసరించాల్సి ఉందని వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ స్వీయ నిర్ణయాలను తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఎం వీ రావు, ఎండీ అండ్ సీఈవో వెల్లడించారు. దేశాభివృద్ధికి అవరోధంగా అవినీతి నిలుస్తుందంటూ జీవితంలో అన్ని దశల్లోనూ సమగ్రతను చాటడానికి ప్రజలు ఆప్రమప్తతతో వ్యవహరించాల్సి ఉందన్నారు. విజిలెన్స్ అవగాహన వారంలో భాగంగా ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద ఉన్న తమ కార్పోరేట్ కార్యాలయంలో ఓ ఫంక్షన్‌ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. బ్యాంక్ సీవీఓ , బ్యాంక్ యొక్క ఉన్నత నిర్వహణ బృందం, బ్యాంక్ ఉద్యోగులతో సమగ్రతా ప్రతిజ్ఞను చేయించారు. బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ అలోక్ శ్రీ వాస్తవ, శ్రీ వివేక్ వాహి, శ్రీ రాజీవ్ పురిలు, బ్యాంకింగ్ రంగంతో పాటుగా సమాజం, మన జీవితంలో అవినీతి అంతమొందించాల్సి ఉందని నొక్కి చెప్పారు.