Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాడ్‌బ్యాండ్ నేటవర్క్లలో ఒకటైన ఎక్సైటెల్ దీపావళి పండగ సందర్భంగా విప్లవాత్మక స్విఫ్ట్ ఆన్‌బోర్డింగ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో సంస్థ మొదటి మూడు నెలలకు కేవలం రూ. 500 ధరతో అన్ లిమిటెడ్ డేటాతో పాటు 200 ఎంబిపిఎస్ అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ స్పీడ్‌ను అందిస్తుంది. అంటే నెలకు రూ. 200 కన్నా తక్కువ ధరకే ఈ ప్లాన్ ను వినియోగదారులు పొందగలరు. ఇంతతక్కువ ధరకు ఈ రకమైన ఇంటర్నెట్ ఆన్‌బోర్డింగ్ ప్లాన్ దేశంలోనే మొదటిసారిగా ఎక్సైటెల్ అందిస్తుందని చెప్పవచ్చు. ఈ ప్లాన్ ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూర్ మరియు డిల్లీ లలో అమలులో ఉన్నది. అధిక ఆన్‌బోర్డింగ్ ధరల కారణంగా ఇంతవరకు అధికవేగం గల ఎఫ్టిటిహెచ్ సర్వీస్ అందుబాటులో లేని వినియోగదారుల సౌకర్యం కోసం ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టినట్టు ఎక్సైటెల్ సంస్థ సిఈవో వివేక్ రైనా తెలిపారు.