Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది అక్టోబర్లో భారత వాణిజ్య లోటు 19.9 బిలియన్ డాలర్లకు తగ్గిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇంతక్రితం సెప్టెంబర్లో ఇది 22.6 బిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన మాసంలో భారత ఎగుమతులు 35.47 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. గతేడాది ఇదే మాసంలో 24.92 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇదే సమయంలో 34.07 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. గత మాసంలో 55.37 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరమే వాణిజ్య లోటు.