Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రముఖ కార్ల దిగ్గజం టొయోటా ఈ రంగంలోని ప్రవేశించింది. ఈ క్రమంలోనే తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యువి టొయోటా బిజెడ్4ఎక్స్‌ను ఆవిష్కరించింది. ఇతర కంపెనీలకు పోటీ ఇచ్చే విధంగా ఇందులో ఫీచర్స్ ఉన్నాయని పేర్కొంది. 2025 నాటికి 'బిజెడ్' సిరీస్ మోడల్స్‌తో సహ మొత్తం 15 విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ కారు 150కెడబ్ల్యు డిసి ఛార్జర్ సహాయంతో బ్యాటరీలను 30 నిమిషాల్లో 80 శాతం వరకు రీఛార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది.