Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం(క్యూ2) 30.72 శాతం వృద్థితో రూ.17.59 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే కాలంలో రూ.13.46 కోట్ల లాభాలు ఆర్జించింది. క్రితం క్యూ2లో కంపెనీ ఆదాయం 34 శాతం పెరిగి రూ.159.53 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.119 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. గడిచిన త్రైమాసికంలో పెయింట్ వ్యాపారం 19.43 శాతం పెరుగుదల నమోదు చేసిందని ఆ కంపెనీ సీఎండీ జె లక్ష్మణ రావు తెలిపారు.