Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యశ్ రాజ్ ఫిలింస్ వారి ‘బంటి ఔర్ బబ్లి-2’ ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 19న విడుదల అయ్యేందుకు సిద్ధం కాగా, రెండు తరాలకు చెందిన రెండు జంటలు బంటీ, బబ్లి పరస్పరం పోటీ పడుతుంటారు! సైఫ్ అలి ఖాన్, రాణి ముఖర్జీ ఓజీ బంటి, బబ్లిగా నటించగా, గల్లిబాయ్ సిద్ధాంత్ చతుర్వేది, కొత్త నటి శార్వరి కొత్త బంటీ, బబ్లిగా నటిస్తున్నారు. ఈ కుటుంబ మనోరంజన చిత్రం ఈ పండుగ సీజన్‌కు విడుదల అవుతోంది. రెండేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఈ దీపావళికి పెద్ద చిత్రాలు విడుదల అవుతున్న సమయంలోనే ఈ సినిమా కూడా విడుదల అవుతుండడంతో ఇందులోని నటీనటులు రోమాంచితులయ్యారు.
సైఫ్ మాట్లాడుతూ, ‘ఒక పరిశ్రమగా రెండేళ్ల అనంతరం దీపావళిని వేడుక చేసుకునేందుకు రోమాంచితులం అయ్యాము!’ మహమ్మారితో మన చిత్ర పరిశ్రమ తీవ్రంగా సమస్యల్లో చిక్కుకుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రేక్షకులు మాకు మద్ధతు ఇస్తున్నారు. థియేటర్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో చక్కని సినిమాలను వీక్షించేందుకు తిరిగి వస్తారన్న విశ్వాసం మాకుంది. చలన చిత్రాలు ఎప్పటికీ పండుగలో భాగం కాగా, కుటుంబాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సినిమాలను వీక్షించాలని కోరుకుంటున్నాయి. ఇది దీపావళి ఆచరించేందుకు ఎటువంటి మార్పు లేదన్న విశ్వాసం మాకు ఉంది’ అని తెలిపారు.
రాణి మాట్లాడుతూ, ‘‘దీపావళి అందరూ ఒక చోట చేరే సందర్భంగా ఉంటుంది. ఈ ఏడాది మహమ్మారితో సుదీర్ఘంగా 2 ఏళ్ల అనంతరం వేడుక చేసుకోవడం అది మరింత అర్థాన్ని సంతరించుకుంది. ఎక్కువ గమనార్హమైంది. చలన చిత్రాలు సముదాయ వీక్షణ అనుభవానికి రిజర్వు అయ్యాయి. ఇప్పుడు అంతిమంగా దాన్ని ఆస్వాదించేందుకు మరోసారి చక్కని అవకాశం వచ్చింది. అందుకే ప్రేక్షకులు వారి కుటుంబాలతో వెండి తెరపై వారికి మనోరంజన అందించే చలనచిత్రాల వీక్షణకు ఈ పండుగ సీజన్లో తిరిగి వస్తారన్న భరోసా మాకు ఉంది. బంటి ఔర్ బబ్లి-2 కుటుంబ మనోరంజన చిత్రంగా తెరకెక్కింది మరియు మేము ఆ భరోసాను నెరవేర్చనున్నాము’’ అని తెలిపారు.
సిద్ధాంత్ మాట్లాడుతూ, ‘‘ సినిమా, వేడుకలు సదా వెంటవెంటనే సాగుతాయి. మనందరికీ థియేటర్లలో సినిమాలను చూసే సంతోషపు సమయాలు గుర్తుండే ఉంటాయి. మేము దాన్ని అలా చూసి, రెండేళ్లవుతుంది. సముదాయంగా మనం సంబరాలు చేసుకుని రెండేళ్లయింది. ఇప్పుడు మనం భరోసా కిరణాన్ని చూస్తున్నాము. వెండి తెరపై మహోన్నతమైన మనోరంజన అందించే సినిమాలను ప్రజలు వీక్షించేందుకు ఆనందిస్తారన్న భోరోసా నాకుంది. థియేటర్లకు తిరిగి వెళదాం అవి ఎలా ఉన్నాయో అలానే సినిమాలను ఆనందిద్దాం’’ అని అన్నారు.
శార్వారి మాట్లాడుతూ, ‘‘ఈ పండుగ సీజన్‌కు థియేటర్లు ప్రారంభించడం అద్భుతమైన అనుభంగా ఉంది. ప్రతి ఒక్కరినీ ఈ సీజన్ మనసులను రంజించే, ప్రతి ఒక్కరినీ కొత్త ప్రపంచానికి తోడ్కొని వెళ్లే దీపావళి మళ్లీ వచ్చింది. వెండి తెరపై మనం సినిమాలను చూసేందుకు ఇది సకాలం. ఈ పండుగ సీజన్‌కు అందరం కలిసికట్టుగా వేడుక చేసుకుందాం. మేము థియేటర్లకు ప్రజలను మరోసారి తీసుకు వచ్చే భరోసాను కలిగి ఉన్నాము. ప్రేక్షకులు భయం లేకుండా థియేటర్లకు తిరిగి వచ్చేందుకు పలు ముందు జాగ్రత్తలను తీసుకున్నాము. ప్రతి ఒక్కరికీ సంతోషాలతో కూడిన రోజులు దీపావళిని అందించాలని మేము కోరుకుంటున్నాము. మా బంటి ఔర్ బబ్లి-2 ద్వారా మేము ప్రేక్షకులు అందరికీ మరోరంజన అందిస్తామని భరోసా ఇస్తున్నాము’’ అని తెలిపారు. యశ్ రాజ్ ఫిలింస్ వారి సంపూర్ణ మనోరంజన అందించే సినిమా బంటి ఔర్ బబ్లి-2 నవంబరు 19,2021న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుండగా, దాన్ని వైఆర్ఎఫ్ వారి అత్యంత పెద్ద బ్లాక్ బస్టర్లయిన సుల్తాన్, టైగర్ జిందాహై సినిమాలకు సహాయక దర్శకునిగా వ్యవహరించిన వరుణ్ వి.శర్మ దర్శకత్వం వహించారు.