Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దీపావళి పురస్కరించుకుని ఇండియన్ ఆయిల్ సంస్ధ వినియోగదారుల కోసం రెండు వినూత్నమైన ఆఫరింగ్స్‌ను దేశవ్యాప్తంగా తీసుకువచ్చింది. స్వచ్ఛమైన, ప్రకృతి అనుకూలమైన డీజిల్ 'ఎక్స్‌ట్రాగ్రీన్'ను 63నగరాల్లోని 126 ఫ్యూయల్ స్టేషన్స్ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ గిఫ్ట్ కార్డ్, 'వన్ 4యు'ను సైతం విడుదల చేసింది. ఎక్స్‌ట్రాగ్రీన్, వన్ 4 యును ఇండియన్ ఆయిల్ ఉన్నతాధికారులు డాక్టర్ ఎస్.వి రామకుమార్, డైరెక్టర్ (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పెట్రో కెమికల్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్) వి.సతీష్ కుమార్, డైరెక్టర్(మార్కెటింగ్) సమక్షంలో ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య ఆవిష్కరించారు. ఆగ్రాలోని ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్ వద్ద ఎక్స్‌ట్రాగ్రీన్ విక్రయాలను శ్రీ వైద్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ మాట్లాడుతూ ''ఆహ్లాదకరమైన భవిష్యత్ దిశగా ఇండియాను తీసుకువెళ్లాలనే ప్రధానమంత్రి యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఎక్స్ట్రాగ్రీన్ను విడుదల చేశాం. కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటుగా 2070 నాటికి నెట్ జీరో గోల్ చేరుకోవడంలోనూ ఇది తోడ్పడుతుంది. వినియోగదారుల అనుభవాలను వృద్ధి చేస్తూనే పర్యావరణ పరంగా సున్నితమైన మార్కెట్లలో ప్రత్యేకమైన పరిష్కారాలను అందించాలనే ఇండియన్ ఆయిల్ యొక్క నిబద్ధతను ఇది వెల్లడిస్తుంది'' అని అన్నారు. సాధారణ డీజిల్‌తో పోలిస్తే ఎక్స్‌ట్రాగ్రీన్ అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో ఇంధన సామర్థ్యం 5-6శాతం పెరగడంతో పాటుగా కార్బన్‌డైఆక్సైడ్ ఉద్గారాలు తగ్గడం, కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు 5.29శాతం తగ్గడం, నైట్రోజన్‌ఆక్సైడ్ ఉద్గారాలు 4.99శాతం తగ్గడం సాధ్యమవుతుంది. మారుతున్న వినియోగదారుల అవసరాలు పరిగణలోకి తీసుకుని, ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్ల వద్ద సౌకర్యం మెరుగుపరచడానికి వన్4యు గిఫ్ట్ కార్డ్ ఆవిష్కరించారు. ఈ కార్డు గురించి వైద్య వెల్లడిస్తూ ''వినియోగదారులకు అనుకూలంగా ఉండే ఈ కార్డుతో వినియోగదారులు పలు గిఫ్టింగ్ డినామినేషన్స్ ఎంపిక చేసుకుని, గ్రహీత వివరాలు నమోదు చేయడంతో పాటుగా ఓచర్ చెల్లింపులు చేస్తే సరిపోతుంది.
ఈ గిఫ్టింగ్ సొల్యూషన్కు అపూర్వ ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాము'' అని అన్నారు.