Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ ఆయుర్వేద ఆరోగ్య రక్షణ సంస్థ డాబర్ ఇండియా విపణీలోకి డాబర్ బేబి సూపర్ ప్యాంట్స్‌ను డైపర్లను ఆవిష్కరించింది. ఇన్‌స్టా, అబ్జార్స్ టెక్నాలజీతో తయారు చేయబడిన ఈ డైపర్లు, ఇతర డైపర్లతో పొలిస్తే 50శాతం అదనంగా పీల్చుకుంటాయి. దేశీయ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్డ్ బిగ్సేల్ డే సమయంలో ఈ ఉత్పత్తి విక్రయాన్ని డాబర్ ఇండియా ప్రారంబించింది. డాబర్ ఇండియా లిమిటెడ్ ఇ- కామర్స్ బిజినెస్ హెడ్ స్మెర్త్ ఖన్నా ఈ ఉత్పత్తి ఆవిష్కరణ గురించి ప్రకటిస్తూ, శిశు సంరక్షణకు అత్యంత నాణ్యమైన, నమ్మకమైన ఉత్పత్తులను అందించాలన్న తమ ప్రయత్నంలో భాగంగానే ఈ డైపర్లను తీసుకువస్తున్నామని తెలిపారు. డాబర్ బేబీ సూపర్ ప్యాంట్స్ మూడు సైజులలో అందుబాటులోకి తెచ్చామన్నారు. 42 ప్యాంట్లతో మధ్యస్థ, 32 ప్యాంట్లలతో పెద్ద ప్యాకెట్లలలో రూ. 549 ధరకు లభిస్తాయని సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.