Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రోజు 17శాతం సబ్‌స్రయిబ్
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చిన పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తొలి రోజు సోమవారం 17 శాతం సబ్‌స్రయిబ్ అయ్యింది. ఈ సంస్థ రూ.18,300 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఐపీఓ కు వచ్చింది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.8,235 కోట్ల విలువ చేసే షేర్లను కేటాయించింది. ఈ కేటగిరీలో సింగపూర్‌కు చెందిన జీఐసీ, కెనాడ సంస్థ సీపీపీఐబీ, బ్లాక్‌రాక్, అబదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సంస్థలు ప్రాథమిక దశలోనే వాటాలను పొందాయి. స్టాక్ మార్కెట్లో మరో రూ.10వేల కోట్ల వాటాలను విక్రయిస్తుంది. ఒక్కో షేర్ విలువ శ్రేణీని రూ.2,080-2,150గా నిర్ణయించింది. పేటియం విలువను రూ.1.39 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఈ సంస్థకు 33.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.