Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద డిజిటల్ మరియు పూర్తిగా షాపింగ్ చేయగల మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ రియాలిటీ ఫ్యాషన్ షో, తన మూడవ సీజన్‌తో తిరిగి వచ్చింది! ఈ ఏడాది వేడుకలు చాలా భారీగా మరియు మెరుగ్గా ఉంటాయని వాగ్దానాన్ని చేస్తోంది. ఎందుకంటే, ఇది పోటీదారులతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌తో మమేకమవుతుంది మరియు వారితో కమ్యూనికేట్ చేసే నిజ జీవిత సంఘటనల కలెక్షన్‌ను ప్రదర్శిస్తుంది. మింత్రఫ్యాషన్ సూపర్‌స్టార్ దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లకు న్యాయమూర్తులు మరియు ఆడియన్స్‌కు వారి సృజనాత్మకతను ప్రదర్శించేందుకు ఒక వేదికను అందించడమే కాకుండా, మనస్తత్వాలను మార్చేందుకు మరియు సంఘంపై చక్కని ప్రభావాన్ని సృష్టించే అవకాశాన్ని కూడా అందిస్తుంది. నవంబర్ 11న మింత్రయాప్ ద్వారా వూట్ మరియు మింత్రస్టూడియోలో మొదటిసారిగా ప్రీమియర్ చేయబడుతూ, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిజిటల్ రియాలిటీ షోలో ఫ్యాషన్ దిగ్గజం మనీష్ మల్హోత్రానేతృత్వంలోని భారతదేశం ఫ్యావరెట్ ఇన్ఫ్లూయెన్సర్లు కుషా కపిల, ఆష్నా ష్రాఫ్, అంకుష్ బహుగుణ మరియు సంతు మిశ్రాన్యాయ నిర్ణేతల బృందంగా వ్యవహరిస్తారు. మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ ఫ్యాషన్ మరియు సోషల్ మీడియాను ఏకీకృతం చేసి లోతుగా ఆత్మపరిశీలనకు అవకాశం కల్పించే సంభాషణలను రూపొందించడంతో పాటు, అదే సమయంలో యువతకు అత్యంత ముఖ్యమైన అంశాలపై ఉత్తేజపరుస్తూ, స్ఫూర్తినిస్తారు. సీజన్ థీమ్, #MFSIWearMyStoryఫిల్టర్ చేయని మరియు ప్రామాణికమైన సంభాషణలతో, ఇన్ఫ్లుయెన్స్ చేసేవారి (పోటీదారులు) నుంచి సార్టోరియల్ ఎంపికలతో వారి ప్రయాణాన్ని వ్యక్తీకరించడం ద్వారా వారి నిజమైన రూపంలో ఉండేందుకు ప్రోత్సహిస్తుంది. అత్యంత ప్రశంసలు పొందిన న్యాయమూర్తులు ఈ సృష్టికర్తల (పోటీదారులు) నుంచి వారి పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మరియు వారికి నచ్చిన వేదికలపై వారికే సొంతమైన విభిన్న స్వరాలను సృష్టించేందుకు వీలుగా ఎంపిక చేస్తారు. ఈ న్యాయనిర్ణేతల బృందానికి నాయకత్వం వహిస్తున్న మనీష్, సీజన్ 1నుంచి మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ (MFS)తో అనుబంధం కలిగి ఉన్నారు మరియు భారతదేశంలో ఫ్యాషన్ పరిశ్రమకు సరికొత్త దిశా నిర్దేశాన్ని ఇవ్వడం, పునర్నిర్వచించడం, ఆధునికీకరణకు కోసం ప్రసిద్ధి చెందిన డిజైన్ స్పేస్‌లో మార్గదర్శకులలో వీరు ఒకరు. ఈ సీజన్లో వారితో కలిసి సోషల్ మీడియాలో తన శైలితో చక్కని గుర్తింపు పొందిన రాణిగా ఉన్న కుషాఅవుట్-ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో హాస్య సంభాషణలను అందించనుంది. తన కెరీర్ ప్రారంభంలో ప్రసిద్ధ దీర్ఘ-కాల ఫ్యాషన్ నిపుణురాలిగా, కుషా ఎల్లప్పుడూ ప్రామాణికమైన మరియు ప్రయోగాత్మకమైన ఫ్యాషన్‌ని ఇష్టపడేది. ఫ్యాషన్‌తో ఆమె ప్రయత్నించడం ద్వారా ఆమె ఒక సృష్టికర్తగా మరియు పరిశ్రమలోని అంతర్గత వ్యక్తిగా ఉత్తమ అభిప్రాయాలను పంచుకోవడంలో సహాయపడుతుండగా, ఇది పోటీదారులు నిర్మాణాత్మకంగా తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశంలోని మొట్టమొదటి మరియు ప్రముఖ స్వీయ-నిర్మిత ఫ్యాషన్ ప్రభావశీలులలో ఒకరైన ఆష్నా,దాదాపు ఒక దశాబ్దం పాటు స్ఫూర్తిదాయకమైన, సాపేక్ష రూపాన్ని సృష్టిస్తున్నారు. ఇతర ప్యానెలిస్ట్‌లలో ఒకరైన అంకుష్, నియమాలు మరియు పక్షపాతాలను సవాలు చేసే హాస్యభరితమైన, ఇంకా సూపర్ వోక్ కంటెంట్‌ను రూపొందించడంలో ప్రసిద్ధికెక్కిన ప్రముఖ పురుష ప్రభావశీలులలో ఒకరు. ఈ సూపర్-టాలెంటెడ్ గ్రూప్‌ని పూర్తి చేయడం సాంతు - కింగ్ మేకర్, గత కొన్ని ఏళ్లుగా భారతదేశపు డిజిటల్ కంటెంట్ ల్యాండ్‌స్కేప్ పరిణామ క్రమంలో కీలక పాత్ర పోషించిన సృజనాత్మక ఆలోచన ఇతనిదే.
#MFSIWearMyStoryలో పాల్గొనేవారిని అంచనా వేసేందుకు న్యాయనిర్ణేతలుగా ఎంపిక చేయబడి, ఆహ్వానించబడిన తర్వాత, ప్యానెల్ సభ్యులు వారి స్వంత వ్యక్తిగత ప్రయాణం గురించి మరియు వారు ఎవరికి వారుగా ఉండేందుకు తమ కథనాలను ఎలా ప్రదర్శిస్తారు అనే దాని గురించి తెలిపేందుకు, ప్రదర్శనను ప్రోత్సహించే చిన్న వీడియోలలో సేకరించగా, ఇవి ప్రేక్షకులకు స్ఫూర్తినివ్వనున్నాయి.
మనీష్ సోషల్ మీడియాలో ప్రామాణికంగా ఉండవలసిన ప్రాముఖ్యత గురించి మాట్లాడారు మరియు ఆయన తన ప్రేక్షకులతో తన వాస్తవ రూపాన్ని బహిర్గతం చేస్తూ ఎక్కువగా నిమగ్నమై ఉన్నందున అది దాని ఉద్దేశ్యాన్ని మార్చదు లేదా ప్రభావితం చేయదు అని తెలిపారు. సంతు తన వ్యక్తిత్వ విశిష్టత గురించి మాట్లాడుతూ, పురుషుల ఫ్యాషన్ స్పేస్‌లో చేరికను సమర్ధిస్తూ తన ప్లస్ సైజ్‌ని అంగీకరించినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. ఆష్నా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన కష్టాలు మరియు తన తల్లి తనకు అందించిన మద్దతు గురించి వివరించారు. అంతర్ముఖురాలు అయినందున, ఆమె తక్కువ మాట్లాడటం మరియు ఫ్యాషన్‌లో తన పని గురించి మాట్లాడేందుకు అనుమతిస్తుంది. కుషా గత ఏడాది తాను అనుభవించిన సమస్యలను మరియు అనంతరం జరిగిన బాధాకరమైన క్షణాల గురించి మాట్లాడారు. ఆమె తన స్వార్థం కోసం జీవించవలసిన ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించారు మరియు తన కథప్రజలను ప్రభావితం చేయడంలో ఆనందాన్ని పొందుతుంది. అంకుష్ చిన్నతనంలో తాను ఎదుర్కొన్న బెదిరింపులు మరియు పక్షపాతాల గురించి, ఏళ్ల తరబడి బాధను అధిగమించేందుకు కెమెరా తన ఔట్లెట్ అని వివరించారు.
● మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3/ తన విజయానికి సంబంధించిన రహస్యాన్ని మనీష్ మల్హోత్రా
● మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3/ తన అన్ఫిల్టర్డ్ కథను పంచుకున్న కుషా కపిల్
● మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3/తన ఉమెన్-ఓన్లీ వరల్డ్‌లో తన విజయగాధను వివరించిన ఆష్నా ష్రాఫ్
● మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3/ అనుష్క బహుగుణ- వివక్షకు గురైన అనంతరం పరిస్థితులను అధిగమించిన విధానం
● మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3/ తన బాడీ పాజిటివిటీ గురించి వివరించిన సంతు మిశ్రా
తన భాగస్వామ్యం గురించి మనీష్ మల్హోత్రా మాట్లాడుతూ, ‘‘ఈ షోలో మరోసారి భాగస్వామిని అయినందుకు నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఈ షో నా హృదయంలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. భారతదేశంలో ప్రీమియర్ షోలలో ఇది ఒకటి కాగా, ఇది వర్ధమాన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మరియు ఫ్యాషన్ ఐకాన్లుగా మారేందుకు ఇది వారికి ఒక అవకాశం ఇస్తుంది. ఈ షో నాకు తాజా మరియు అసలైన ప్రతిభతో సంభాషించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ సీజన్లో పోటీదారులు ఎవరు మరియు ఈ సీజన్లో వారు ఎలా పనిచేస్తారో చూడటానికి నేను ఆసక్తిగా ఉన్నాను’’ అని వివరించారు.
షోలో భాగమైనందుకు కుషా కపిలతన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ‘‘వాస్తవానికి నేను 7ఏళ్లు ఫ్యాషన్‌లో కార్పొరేట్ ఉద్యోగాలలో బహుళ విభాగాల్లో పనిచేశాను మరియు కంటెంట్ సృష్టికర్తగా మారడానికి ముందుగా జూనియర్ ఫ్యాషన్ ఎడిటర్‌గా నా చివరి ఉద్యోగం చేశానని కొందరికి మాత్రమే తెలుసు. నేను ఫ్యాషన్‌ని లోతైన స్థాయిలో అర్థం చేసుకున్నాను మరియు చాలా సాంకేతిక కోణం నుంచి చూస్తాను. క్రియేటర్‌గా ప్రారంభమైన నా ప్రయాణంలో, నెలకొల్పిన క్రియేటర్ల నుంచి నా పని గురించి వచ్చే అభిప్రాయాలు మరియు నా కంటెంట్‌పై వారి అభిప్రాయాన్ని పొందేందుకు నేను ఇష్టపడతాను. మింత్రఫ్యాషన్ సూపర్‌స్టార్ అనేది ఫ్యాషన్ మరియు కంటెంట్లకు సంబంధించిన ఆసక్తికరమైన సమ్మేళనం. నేను ప్రదర్శనకు సహకరించే ప్రతిదానికీ పోటీదారులు సృష్టించే కంటెంట్ నాణ్యతలో తేడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. దాని కోసమే నేను ఇక్కడ ఉన్నాను’’ అని పేర్కొన్నారు.
ఆష్నా ష్రాఫ్ మాట్లాడుతూ, “నేను ఫ్యాషన్ మరియు అందాన్ని ప్రభావితం చేసే వ్యక్తిని కనుక మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ రానున్న సీజన్లలో ఇన్ఫ్లుయెన్సర్లు ఏమి తీసుకువస్తారో చూసేందుకు ఉత్సుకతతో ఉన్నాను. నేను గత రెండు సీజన్లను ఫాలో అయ్యాను మరియు పోటీదారులు వారి ఫ్యాషన్, సౌందర్యానికి సంబంధించిన ఎంపికలపై మరియు వారు తమ కళాఖండాలను వ్యక్తిగతంగా క్యారీ చేసే మరియు వ్యక్తీకరించే విధానం పట్ల కలిగి ఉన్న విశ్వాసం నన్ను బాగా ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు.
సంతు మిశ్రామాట్లాడుతూ, ‘‘మనం చాలా మంది ప్రతిభావంతులైన యువతను కలిగి ఉండగా, అద్భుతమైన ఫ్యాషన్ సెన్సిబిలిటీలతో, తమ ప్రతిభను ఆవిష్కరించేందుకు వేచి ఉన్నారు. ఆ ప్రతిభను గుర్తించేందుకు ఇది ఒక చక్కని అవకాశం మరియు మింత్రఫ్యాషన్ సూపర్ స్టార్ వారికి చక్కని వేదిక. నేను ఈ షో గత సీజన్లను అనుసరించేవాడిని మరియు ఈ సీజన్లో భాగమైనందుకు నేను పూర్తిగా సంతోషిస్తున్నాను’’ అని తెలిపారు.
అంకుష్ బహుగుణ మాట్లాడుతూ, “అయితే ఫ్యాషన్ ఉంది కానీ కంటెంట్ క్రియేటర్‌గా ఉండడం చాలా ఎక్కువ అవసరం. షోలో భాగమైనందుకు మరియు ఈ కొత్త క్రియేటర్లు టేబుల్ పైకి ఏమి తీసుకువస్తారో చూసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను’’ అని ముగించారు.
ఈ షో మూడవ ఎడిషన్ విభిన్నమైన సొంత ప్రతిభ, వ్యక్తిగత వ్యక్తీకరణ మరియు శక్తివంతమైన ఎంగేజ్మెంట్తో పాల్గొని పోరాటం చేసేందుకు వర్ధమాన మరియు స్థిరపడిన ఫ్యాషన్, జీవనశైలి, సౌందర్య ప్రభావశీలల కలయికతో హోస్ట్ చేస్తుంది. మింత్రఫ్యాషన్ సూపర్‌స్టార్ నవంబర్ 11నుంచి మింత్రయాప్లో వూట్ మరియు మింత్రస్టూడియోలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇన్ఫ్లుయెన్సర్ల (పోటీదారుల), ప్రత్యేకమైన తెరవెనుక ఫుటేజీలు మరియు ఎపిసోడిక్ రివ్యూలతో, మింత్రస్టూడియో మరియు వూట్‌లో అందుబాటులో ఉంటాయి. మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ సీజన్ 3లో ఫ్యాషన్ సూపర్స్టార్లను గుర్తించేందుకు అనువైన గమ్యస్థానం. మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్ ఎనిమిది భాగాల సిరీస్‌ను చేరువగా వీక్షించడాన్ని మిస్ కావద్దు!