Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బంటి ఔర్ బబ్లి- 2 ప్రకటించినప్పటి నుంచి ఈ చలన చిత్రంలోని ఆశ్చర్యకరమైన మోసాలను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహం ఎక్కువైంది. ఈ ప్రాజెక్టుకు చేరువగా ఉన్న మూలాల నుంచి మాకు ఈ కుటుంబ మనోరంజన చిత్రం పండుగ గురించి సమాచారం ఉండగా, సైఫ్ అలి ఖాన్, రాణి ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది మరియు అందాల కొత్త నటి శార్వరి వారి నుంచి 8 విలక్షణ మరియు సూపర్ ఇంటెలిజెంట్ మోసాలు ఇప్పుడు ప్రేక్షకులను పూర్తిగా అలరిస్తాయి. వ్యాపారాల మూలాల ప్రకారం, ‘‘బంటి ఔర్ బబ్లి 2 ప్రేకులకు సమగ్ర మనోరంజన ఇచ్చే, హాస్యం కోసం డిజైన్ చేసి, నిర్మించారు. ఎందుకంటే ఈ సినిమా మోసగాళ్ల గురించి కాగా, ఇందులో విశిష్ట మరియు సూపర్ ఇంటెలిజెంట్ అయిన భారీ మోసాల గురించి అపారమైన నిరీక్ష ఉంది. బంటి ఔర్ బబ్లి 2 ఈ నిరీక్షను వమ్ముకానీయదు. ఎందుకంటే, నిర్మాతలు 8 భారీ మోసాలను బంటి మరియు బబ్లి రెండు సెట్లలో చూసేందుకు, వారి వంచన వేషాలను చూసేలా తెరకెక్కించారు!’’ దీని గురించి బంటి ఔర్ బబ్లి-2 దర్శకుడు, వైఆర్ఎఫ్ వారి అత్యంత పెద్ద బ్లాక్ బస్టర్లయిన సుల్తాన్ మరియు టైగర్ జిందా హై సహాయక దర్శకుడు వరుణ్ వి.శర్మను సంప్రదించినప్పుడు ఆయన మాట్లాడుతూ, ‘‘ ఈ ఇదద్రు బంటి బబ్లిల జంటలు ఎలా తెలివిగా మోసాలు చేస్తారనేందుకు మీరు తెలుసుకునేందుకు మీరు సినిమా చూడాలి. ఇది పరస్పరం తామే ఉత్తమ మోసగాళ్ల జంట అని చూపించుకునేందుకు కోరుకునే మోసాన్ని చేసే కళాకారుల చిత్రంగా దీన్ని తెరకెక్కించాము’’ అని తెలిపారు. మరింత వివరిస్తూ, ‘‘మీరు అత్యంత పెద్ద మోసాలను చూడవచ్చు, ఎందుకంటే దానికి న్యాయం చేసేందుకు బంటి ఔర్ బబ్లిని మరోసారి రూపొందించాము. మానలో నిజానికి కొన్ని ప్రత్యేక మోసాలు ఉండగా, అవి ప్రేక్షకులను రంజిస్తాయి మరియు వారి ప్రతిస్పందన వీక్షించేందుకు ఆత్రుతతో వేచి చూస్తున్నారు. మేము ఈ సినిమాను అడ్డంకులు లేని మనోరంజనగా తెరకెక్కించాము మరియు మేము ఈ భరోసాను నెరవేర్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము’’ అని తెలిపారు. బంటి ఔర్ బబ్లి-2 ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 19, 2021న విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ అత్యంత హాస్యభరితమైన కామెడీ విభిన్న తరాలకు చెందిన మోసాలు చేసే రెండు జంటలు ఒకరిని మరొకరు అధిగమించేందుకు మోసాలతో పైపోటీ పడుతుంటారు!