Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో చిన్న వ్యాపారాలకు తన నిబద్ధతను బలపరుస్తున్న మెటా; ప్రారంభ ఎడిషన్ ‘గ్రో యువర్ బిజినెస్ సమ్మిట్’లో స్థానికత కలిగిన బిజినెస్ హబ్‌ను ప్రారంభించింది
● భారతీయ చిన్న వ్యాపారాలు నేడు ప్రపంచ స్థాయి వ్యాప్తిని కలిగి ఉన్నాయి; ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లకు పైచిలుకు జనాభా ఫేస్బుక్లో ఇండియన్ స్మాల్ బిజినెసెస్ పేజ్‌ను లైక్ చేశారు లేదా అనుసరిస్తున్నారు
● ఇన్‌స్టాగ్రామ్‌లోని అర-మిలియన్ కన్నా ఎక్కువ మంది భారతీయులు ఇండియన్ స్మాల్ బిజినెసెస్‌లో తమ బయోడేటాలో వాట్సప్ నంబరు లేదా ఫోన్ నంబరు లేదా ఇ-మెయిల్‌ను అందుబాటులో ఉంచారు లేదా మెటా యాప్‌ల ద్వారా వినియోగదారులను నేరుగా సంప్రదించి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
9 నవంబరు, 2021: దేశంలోని చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాల (SMB) అభివృద్ధి ఎజెండాపై దృష్టి సారించిన ఈవెంట్ ‘గ్రో యువర్ బిజినెస్ సమ్మిట్’ ప్రారంభ ఎడిషన్‌ను ప్రారంభించడం ద్వారా ఫేస్బుక్ ఇండియా భారతదేశంలోని చిన్న వ్యాపారాల పట్ల తన నిబద్ధతను మరింత బలోపేతం చేసింది. సదస్సులో విభిన్న అంశాల్లో అభివృద్ధి చెందుతున్న, చిన్న పట్టణాలు మరీ ముఖ్యంగా గ్రామీణ భారతదేశంతో సహా దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి చిరు వ్యాపారాలు చేసే వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిజిటల్ సాంకేతికతలు మరియు మెటా యాప్‌లను ఉపయోగించి వారు తమ వ్యాపారాన్ని ఎలా మార్చుకునేందుకు వారు అనుసరించిన విధానాలకు సంబంధించిన కథనాలను ఇతరులతో పంచుకున్నారు. ‘గ్రో యువర్ బిజినెస్ హబ్’ను (Grow Your Business Hub)ప్రారంభించామని కంపెనీ ఇదే సందర్భంలో ప్రకటించగా, ఇది సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాల కోసం వారి వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా సంబంధిత సమాచారం, పరికరాలు మరియు వనరులను కనుగొనేందుకు ఒన్ -స్టాప్ గమ్యస్థానంగా ఉంటూ వారి వృద్ధి ప్రయాణంలో చేదోడు ఇవ్వనుంది.
ప్రతి నెలా మిలియన్ల కొద్దీ చిన్న వ్యాపారాలు – భారతదేశంలో వాట్సప్‌లో 15 మిలియన్ల మంది- వాట్సప్‌లో తమ ఆన్లైన్ ప్రయాణాలను ప్రారంభించేందుకు మరియు తమ వ్యాపార వృద్ధికి, విస్తరించుకునేందుకు ప్రతి నెల మెటా యాప్‌లను ఉపయోగించుకుంటున్నారు. ఫేస్బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లను ఉపయోగించుకుని 300 మిలియన్లకు పైగా ప్రజలు ఫేస్బుక్లో భారతీయ స్మాల్ బిజినెసెస్ పేజీని లైక్ చేయడం లేదా అనుసరించడంతోనే వారి వ్యాపారాలు ప్రపంచవ్యాప్త స్థాయిని అందుకుంటున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో గత మూడు నెలల్లో భారతదేశంలోని వ్యక్తులు చిన్న వ్యాపారాలకు మరియు స్థానికంగా కొనుగోలు చేసేందుకు తమ మద్దతును ప్రకటిస్తూ 1.2 మిలియన్ల పైచిలుకు ఫాసెట్లు, వ్యాఖ్యలు సృష్టించారు. భారతదేశంలోని ఇన్‌స్టాగ్రామ్‌లో అర మిలియన్ కన్నా ఎక్కువ మంది భారతీయ చిన్న వ్యాపారాలు వాట్సాప్ లేదా ఫోన్ నంబర్ లేదా వారి బయోలో ఇమెయిల్‌ను జాబితా చేశాయి లేదా డిఎం ద్వారా నేరుగా సంప్రదించేందుకు ఎక్కువ మంది వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాయి. వృద్ధి చెందుతున్న చిన్న వ్యాపారాలు నేరుగా వినియోగదారులను చేరుకునేందుకు మెటా యాప్‌లను వినియోగించుకుంటున్నారని ఇది సూచిస్తోంది.
ఫేస్బుక్ ఇండియా స్మాల్ & మీడియం బిజినెస్ డైరెక్టర్ అర్చనా వోహ్రా మాట్లాడుతూ, ‘‘చిన్న వ్యాపారాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి ఇంజిన్లు కాగా, వాటిలో చాలా వరకు ఆన్‌లైన్‌లోకి వెళ్లి అభివృద్ధి అవకాశాలను అన్‌లాక్ చేసుకోవడంలో, వ్యాపా విస్తరణకు మెటా యాప్‌ల పాత్ర గతంలో కంటే చాలా కీలకంగా మారడంతో ఎక్కువ మంది డిజిటల్ విధానాలను అనుసరిస్తున్నారు. క్యూరేటెడ్ మరియు కస్టమైజ్డ్ బిజినెస్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ల నుంచి చిన్న బిజినెసెస్ల కోసం వ్యాపార మూలధనాన్ని అందుకునే కార్యక్రమాల వరకు, మేము ఇండియా-ఫస్ట్ అనే విధానంతో భారతదేశంలో ఎస్బిఎంల అభివృద్ధికి శ్రమిస్తోంది. తమ వృద్ధి ప్రయాణంలో వివిధ దశల్లో ఉన్న చిన్న వ్యాపారాల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ రోజు మేము చిన్న వ్యాపారాలు తమ లక్ష్యాలకు అనుగుణంగా వనరులను కనుగొనేందుకు ఒన్ -స్టాప్ గమ్యస్థానంగా ‘గ్రో యువర్ బిజినెస్ హబ్’ను ప్రకటిస్తున్నాము’’ అని వివరించారు.
‘గ్రో యువర్ బిజినెస్ హబ్’తో పాటు, సదస్సు ప్రారంభ ఎడిషన్‌లో ‘గ్రో యువర్ బిజినెస్ ప్లేబుక్’ ప్రారంభించగా, ఇది మా యాప్‌లలో వారి ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ప్రారంభ దశ వ్యాపారాలను ప్రేరేపించేందుకు మరియు సన్నద్ధం చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది. చిన్న వ్యాపారాలు వ్యాపార పేజీని ప్రారంభించడం, పేజీలో కంటెంట్‌ను సృష్టించడం, ప్రకటనలను ప్రారంభించేందుకు వారు తీసుకోవలసిన మొదటి దశల వరకు తెలుసుకోవలసిన ప్రతి అంశంపై భారతదేశం మొట్టమొదటి ప్రచురించిన పుస్తకం ప్లేబుక్. ప్లేబుక్ మొదటి ఎడిషన్‌లో వ్యాపారాలు ఆఫ్‌లైన్ నుంచి ఆన్లైన్ ప్రయాణాలకు సెటప్ చేయడంలో సహకరించడం మరియు కొవిడ్-19 సమయం నుంచి మరియు అంతకు మించిన చిన్న వ్యాపారాల కోసం ఆన్లైన్ విక్రయాలను వేగవంతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
చిన్న వ్యాపారాల అభివృద్ధికి మద్దతుగా ఫేస్బుక్ ఇటీవలి నెలల్లో ప్రారంభించిన అనేక కార్యక్రమాలు మరియు ఇంటర్వెన్షన్లను నేపథ్యంగా తీసుకుని ఈ కొత్త వనరులు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల, ఫేస్బుక్ తన చిన్న వ్యాపార ప్రకటనదారులకు థర్డ్ పార్టీ రుణదాతల ద్వారా వ్యాపార రుణాలను పొందేందుకు ఫేస్బుక్ ‘స్మాల్ బిజినెస్ లోన్స్ ఇనిషియేటివ్’ను ప్రారంభించింది.
మే 2021 నుంచి డెలాయిట్ ‘‘డైనమిక్ మార్కెట్స్, చిన్న వ్యాపార ఆవిష్కరణలను అన్‌లాక్ చేయడం, వ్యక్తిగతీకరించిన ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ద్వారా వృద్ధి చెందడం’’ అనే ఫేస్బుక్ కమిషన్ చేసిన అధ్యయనంలో భారతదేశంలోని 80% కన్నా ఎక్కువ చిన్న వ్యాపారాలు తమ వ్యాపారాన్ని చేసేందుకు ఫేస్బుక్ యాప్‌లు ముఖ్యమని పేర్కొన్నాయి. అవి నేడు మరింత బలంగా మారి, వారిని మార్కెట్లో పోటీ పడేలా చేస్తున్నాయి. అలాగే సమక్షకు స్పందించిన 80% కన్నా ఎక్కువ ఎస్ఎంబిలు తమ వ్యాపార విజయానికి, కొత్త వినియోగదారులను సమర్థవంతంగా చేరుకునేందుకు మరియు మార్కెటింగ్ ఖర్చుపై అధిక రాబడిని సాధించడానికి వ్యక్తిగతీకరించిన ప్రకటనలు ముఖ్యమని పేర్కొన్నాయి.