Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వం ద్వారా పనులు చేయించుకుని ఆయన కుమారుడు జగన్ మోహన్‌రెడ్డి కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టారని సీబీఐ పెట్టిన కేసులను కొట్టేయాలని కోరుతూ హెటిరో కంపెనీ, ఆ కంపెనీ అధినేత శ్రీనివాస్‌రెడ్డి వేసిన రిట్లపై హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. మంగళవారం పిటిషనర్లు, సీబీఐల వాదనలు పూర్తయ్యాయి. తీర్పు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ చెప్పారు. వాదనల తర్వాత సిబీఐ, హెటిరోలు తమ వాదనలను లిఖితపూర్వకంగా నివేదించాలని ఆదేశించారు. జగన్‌కు చెందిన జగతి కంపెనీలో పెట్టుబడుల గురించి హెటిరోపై సీబీఐ చార్జిషీటు అసత్యమనీ, జగన్, విజయసాయిరెడ్డి అక్రమ పెట్టుబడులకు కారణమని సీబీఐ ఆరోపణకూ తమ కంపెనీల పెట్టుబడులకు సంబంధం లేదని పిటిషనర్లు వాదించారు. సీబీఐ అభియోగాలను ఐఆర్ఏఎస్ మాజీ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి సవాల్ చేసిన వాదనలను మంగళవారం కొనసాగాయి. వాన్‌పిక్ ఫైళ్లను కార్యదర్శి మన్మోహన్సింగ్కి నివేదిస్తే ఆయన నిర్ణయం తీసుకున్నారనీ, ఫైళ్లపై సంతకాలు చేసే అధికారం అప్పటి ప్రభుత్వం తనకు ఇచ్చిందని చెప్పారు. ఈ నిర్ణయాల వల్ల తనకేమీ వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూరలేదన్నారు. విచారణ బుధవారానికి వాయిదా పడింది.
బ్యాంకు రుణాల ఎగవేతపై సీబీఐ, ఈడీ విచారణను అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.