Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే వారం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎన్బీ) చైర్మెన్, సీఈఓతో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. దేశంలో రుణ లభ్యత పెంపు, ఆర్థిక వ్యవస్థ పురోగతి తత్సంబంధ అంశాలపై ఇందులో చర్చకు రానున్నాయని సమాచారం. నవంబర్ 17, 18 తేదీలో జరగనున్న ఈ సమావేశానికి బ్యాంకర్లతోపాటు వివిధ మంత్రిత్వశాఖలు సీనియర్ అధికారులు హాజరుకానున్నారు. ముఖ్యంగా మౌలిక, వ్యవసాయ సంబంధిత విభాగాల అధికారులు ఆయా రంగాలు ఎదుర్కొంటున్న రుణ సవాళ్లను బ్యాంకర్ల దష్టికి తీసుకువెళతారని సమాచారం. ఎస్బీఐ మాజీ సీఎండీ ప్రతీప్ చౌదరి అరెస్ట్ నేపథ్యంలో ఈ అంశాన్ని బ్యాంకర్లు ఆర్థిక మంత్రి దష్టికి తీసుకెళ్లనున్నారు. రుణాల జారీ అంశంలో ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుతూ ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది.