Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి బుధవారం మార్కెట్లోకి సరికొత్త సెలెరియోను విడుదల చేసింది. ఈ న్యూ సెలెరియో ఎక్స్‌షోరూం ధరను రూ 4.99 లక్షల నుంచి రూ 6.94 లక్షలుగా నిర్ణయించింది. ఈ హచ్‌బ్యాక్ లీటర్ పెట్రోల్‌కు 26.68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ఆ కంపెనీ తెలిపింది. దేశంలో పాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఆల్ న్యూ సెలెరియో కీలక వాహనంగా నిలుస్తుందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ పేర్కొన్నారు.