Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు పీఎస్‌యూల లక్ష్యం
న్యూఢిల్లీ : మార్కెట్లోకి విద్యుత్ వాహనాల రాక భారీగా పెరగడంతో వీటి చార్జింగ్ స్టేషన్లపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే మూడునుంచి ఐదేండ్లలో 22,000 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని చమురు పిఎస్‌యులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో ఐఒసి గరిష్ఠంగా 10వేల ఔట్లెట్లను ఏర్పాటు చేయనుందని ఆ సంస్థ చైర్మెన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య వెల్లడించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 7,000 స్టేషన్లను ఏర్పాటు చేయనుందని సంస్థ చైర్మెన్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మరో 5,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. ఈ మూడు సంస్థలు వచ్చే ఏడాది కాలంలో నాలుగువేల ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నాయి.