Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిలైవ్ వెల్లడి
హైదరాబాద్ : దేశంలోనే తొలి ఇవి ఎక్స్పీరియన్స్ వేదిక బిలైవ్ తమ మల్టీ బ్రాండ్ ఇవి స్టోర్ ప్లాట్‌ఫామ్‌ను ఆఫ్‌లైన్‌లోకి తీసుకువ స్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా తమ తొలి స్టోర్‌ను బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. తమ వినియోగదారులందరికీ అనుసంధానిత అనుభవాలను భారతీయ బ్రాండ్లు డిజైన్ చేసి తయారు చేసిన విద్యుత్ ద్విచక్రవాహనాలు, ఎలక్ట్రిక్ బైసైకిల్స్ (ఈబైక్స్)ను ఇక్కడ అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ వ్యవస్థాపకులు సందీప్ ముఖర్జీ తెలిపారు. రాబోయే మూడేండ్లలో 100కు పైగా ఆఫ్‌లైన్ స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.