Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చిరు తిండ్ల పరిశ్రమలోని ట్రూ గుడ్ తాజాగా నిధులు సమీకరించినట్టు తెలిపింది. సిరీస్ 'ఎ' ఫండింగ్ రౌండ్ ద్వారా ఓక్స్ అసెట్ మేనేజ్మెంట్ నుంచి రూ.55 కోట్ల నిధులను అందుకున్నట్టు ట్రూ గుడ్ సీఈఓ, వ్యవస్థాపకులు రాజు బూపతి తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని తమ కార్యకలాపాలను ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయన్నారు. వచ్చే మూడేండ్లలో రూ.300 కోట్ల రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ట్రూ గుడ్ మొదట మిల్లెట్ ఆధారిత చపాతీలు, పరాఠాలను ఉత్పత్తి చేయడం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.