Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణె : తపాళ శాఖకు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)తో బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (బీఏఎల్ఐసీ) కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంలో పోస్టల్ శాఖ డీడీజీ పవన్ కుమార్ సింగ్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ జె వెంకటరాము, బీఏఎల్ఐసీ సీఈఓ తరుణ్ చుగ్ పాల్గొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఐపిపిబి 650 శాఖలు, 1,36,000కు పైగా బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్ల ద్వారా తమ వినియోగదారులకు టర్మ్, యాన్యువిటీ ఉత్పత్తులను అందించనున్నట్లు చుగ్ పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంతో ముఖ్యంగా బ్యాంకు సేవలు అందుబాటులో లేని ప్రాంతాలలో వినియోగదారులకు తగిన సేవలను అందించడం వీలవుతుందని చుగ్ తెలిపారు.