Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 433 పాయింట్ల పతనం
- మూడో రోజూ మార్కెట్ల దిగాలు
ముంబయి : ద్రవ్యోల్బణ భయాలకు తోడు విదేశీ నిధులు తరలిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలు చవి చూశాయి. గురువారం సెషన్లో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 60వేల దిగువకు పడిపోయింది. తుదకు 433.13 పాయింట్లు లేదా 0.72 శాతం కోల్పోయి 59,919కు పడిపోయింది. నిఫ్టీ 143.60 పాయింట్లు లేదా 0.80 శాతం నష్టపోయి 17,873.60 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో ఎస్బీఐ అత్యధికంగా 2.8 శాతం కోల్పోయి రూ.510 వద్ద ముగిసింది. బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.6 శాతం, 0.5 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈలో 1,882 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కోగా.. 1,399 సూచీలు లాభాలను నమోదు చేశాయి. రియాల్టీ సూచీ 2.5 శాతం విలువ కోల్పోగా.. బ్యాంకింగ్, వైద్య, టెలికం రంగాలు ఒక్క శాతం చొప్పున తగ్గాయి.