Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దాదాపు సంవత్సరంకు పైగా మహమ్మారితోనే గడుపుతున్నాము మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రొఫెషనల్స్ రిమోట్ వర్కింగ్‌ను సాధారణతగా మలుచుకున్నారు. డబ్ల్యుఎఫ్హెచ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) కన్నా కూడా డబ్ల్యుఎఫ్ఏ(వర్క్ ఫ్రమ్ ఎనీవేర్) ఇప్పుడు నూతన సాధారణతగా మారింది. పనిప్రాంగణాల పరంగా ఇది భవిష్యత్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇది శాశ్వతంగా మన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలను మార్చడంతో పాటుగా అక్షరాలా డబ్ల్యుఎఫ్ఏగా మనల్ని మారుస్తుంది. అది ఆఫీస్ క్యుబికల్లో మనం పనిచేసినా, మీ కిచెన్ కౌంటర్, మీ స్నేహితుల ఇళ్లు, అందమైన బీచ్‌లు లేదంటే ఆఖరకు కొండ ప్రాంతాలైనా సరే మీ వర్క్ స్టేషన్‌గా మారిపోవచ్చు.
అవసరమైన వర్క్‌కేషన్ తీసుకునేందుకు దేశవ్యాప్తంగా తమ వెకేషన్ గృహాల వ్యాప్తంగా ప్రొఫెషనల్స్ సౌకర్యాన్ని కోరుకుంటున్న ధోరణులు వృద్ధి చెందుతుండటం మేము ఇప్పుడు చూస్తున్నాము. పెయిడ్ క్లౌడ్ స్టోరేజీ మోడల్స్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ ఓ సవాల్‌గానే ఉంది. దీనికి తోడు ఆఫ్‌లైన్ స్టోరేజీ అనేది మరింత ఆవశ్యకంగగా మారింది. మీరు ఎక్కడ ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా మీ పని సౌకర్యవంతం చేయడంలో తోడ్పడే డబ్ల్యుడీ మరియు శాన్డిస్క్ లాంటి కొన్ని సుప్రసిద్ధ బ్రాండ్ల ఉత్పత్తులను ఇక్కడ వెల్లడిస్తున్నాము
పూర్తిగా చార్జ్ అయిన మరియు బ్యాక్ అప్ కలిగిన ఫోన్‌తో మీ అనుభవాలను తట్టి లేపండి
పలు క్యుఐ అనుకూలీకరణ ఉపకరణాలను చార్జింగ్ కోసం తీసుకువెళ్లినా, ఎక్కువ వైర్లను తీసుకుని వెళ్లాలనే కష్టం మాత్రం వద్దనుకుంటున్నారా ? ఆందోళన చెందనవసరం లేదు. శాన్డిస్క్ ఈ దిశగా మీకు తోడ్పడుతుంది. శాన్డిస్క్ ఐఎక్స్‌పాండ్ వైర్లెస్ చార్జర్ సింక్ (SanDisk® Ixpand® Wireless Charger Sync), ప్రపంచంలో మొట్టమొదటి 2 ఇన్ 1 ద్వంద్వ పనితీరు కలిగిన ఉపకరణం. దీనితో మీ ఉపకరణానికి అవసరమైన శక్తిని అందించడం మాత్రమే కాదు, మీ డాటా నిల్వ, బ్యాకప్ తీసుకునేందుకు సైతం తోడ్పడుతుంది. ప్రయాణించండి, నిద్రపోండి, చార్జ్ చేయండి మరలా తిరిగి ప్రారంభించండి. కేవలం ఒక వైర్‌తోనే ఇదంతా సాధ్యం చేసుకోండి. మీ మరుపురాని క్షణాలను 256 జీబీ విస్తరించతగిన స్టోరేజీలో మీ రోజువారీ అలవాట్లు మార్చుకోకుండానే నిల్వ చేసుకోవచ్చు. వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన చార్జింగ్ పరిష్కారాలను కోరుకుంటున్న వినియోగదారులు శాన్డిస్క్ ఐఎక్స్‌పాండ్ (SanDisk Ixpand) చార్జర్ 15వాట్ సైతం ఎంచుకోవచ్చు.
ఐఎక్స్‌పాండ్ వైర్లెస్ చార్జర్ సింక్ ఇప్పుడు 256జీబీ సామర్థ్యంతో వస్తుంది. దీని గరిష్ట విక్రయ ధర 9999 రూపాయలు. క్యుసీ 3.0 అడాప్టర్‌తో ఐఎక్స్‌పాండ్ వైర్లెస్ 15వాట్ ఫాస్ట్ చార్జర్ గరిష్ట విక్రయ ధర 2999 రూపాయలు. అమెజాన్ ఇండియా వద్ద ఇది లభ్యమవుతుంది. ఈ వైర్లెస్ చార్జర్లు రెండు సంవత్సరాల పరిమిత వారెంటీతో వస్తాయి.
బహుళ ఉపకరణాలు– ఒకటే పరిష్కారం
విభిన్నమైన ఆపరేటింగ్ సిస్టమ్స్ కలిగిన ఉపకరణాల నడుమ డాటా బదిలీ అనేది ఓ పీడకలగానే ఉంటుంది చాలామందికి! ఇకపై అది ఎంత మాత్రమూ కష్టం కాదు. శాన్డిస్క్ ఐఎక్స్‌పాండ్ ఫ్లాష్ డ్రైవ్ లక్స్ (SanDisk iXpand Flash Drive Luxe) పరిపూర్ణమైన రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇది డ్యూయల్ లైటెనింగ్ మరియు యుఎస్బీ టైస్ సీ కనెక్టర్లు కలిగిన శాన్డిస్క్ యొక్క మొట్టమొదటి 2–ఇన్ –1 ఫ్లాష్ డ్రైవ్. దీనిద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లు మరియు ఓఎస్ ఉపకరణాల నడుమ సహా టైప్–సీ ఉపకరణాల నడుమ ఫైల్ బదిలీ అత్యంత సౌకర్యవంతంగా చేయవచ్చు. మీరు బయటకు వెళ్లిన ప్రతిసారీ మీ ఫోన్ నుంచి డాటా బదిలీ చేయడం కోసం మీ ల్యాప్‌టాప్ ను వెంట తీసుకుని వెళ్లడం అవసరం లేదు. ఈ ఫ్లాష్‌డ్రైవ్ అత్యంత సౌకర్యవంతమైన రీతిలో కంటెంట్ బదిలీ చేసేందుకు సహాయపడుతుంది. శాన్డిస్క్ స్టోరేజీ డివైజెస్ వినియోగదారులకు లభ్యమయ్యే మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే శాన్డిస్క్ మెమరీ జోన్ యాప్. అత్యంత సౌకర్యవంతమైన మరియు ఒన్‌స్టాప్ సొల్యూషన్ ఇది. తమ శాన్డిస్క్ వ్యవస్థల వ్యాప్తంగా వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా బ్యాకప్ తీసుకోవడం మరియు డిస్క్‌లను ఖాళీ చేయడంతో పాటుగా ఫైల్స్‌ను బదిలీ చేయడం మరియు నిర్వహించడంలో ఒక సులభమైన, ఒన్‌స్టాప్ పరిష్కారంగా నిలుస్తుంది. ప్రపంచ అన్వేషికులూ ఇక బయల్దేరండి !
64జీబీ స్టోరేజీ ధర 4,449 రూపాయలు, 128జీబీ స్టోరేజీ 5,919 రూపాయలు, 256 జీబీ స్టోరేజీ 8,999 రూపాయలలో అమెజాన్ ఇండియా వద్ద లభిస్తాయి.
మీ అరచేతిలో అపరిమిత స్టోరేజీ
శాన్డిస్క్ అలా్ట్ర డ్యూయల్ డ్రైవ్ లక్స్ ను దేశంలో విస్తరిస్తున్న టైప్ –సీ, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దారు. ఈ అత్యధిక పనితీరు కలిగిన యుఎస్బీ వినియోగదారులు తమ కంటెంట్‌ను పలు టైప్ –సీ మరియు టైప్–ఏ ఉపకరణాల నడుమ ఎలాంటి ఇబ్బంది లేకుండా బదిలీ చేసుకునేందుకు తోడ్పడుతుంది. అతి సులభంగా డాటా బదిలీ చేసుకునే సౌకర్యం కారణంగా క్లౌడ్ స్టోరేజీకి ఓ ప్రత్యామ్నాయంగా దీనిని నిలుపుతుంది. ఎందుకంటే ఇక్కడ నెలవారీ చందాలు మీరు చెల్లించనవసరం లేదు. ఇది మీరు సరిహద్దులు దాటి వెళ్లినా లేదంటే అతి తక్కువ కనెక్షన్ కలిగిన ప్రాంతంలో ఉన్నా సరే ఇది పనిచేస్తుంది. మీరెప్పుడైనా రోడ్డు మీద ఉండి, మీ పనిచేయని ఫోన్‌కు ఎవరైనా హై రిజల్యూషన్ చిత్రాలను పంపినట్లయితే, మీరు ఆ చిత్రాల నాణ్యత పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని ఎలా బదిలీ చేయాలో మీకు తెలుసు కదా!
32జీబీ, 64జీబీ, 128జీబీ, 256జీబీ, 512 జీబీ మరియు 1టీబీ సామర్థ్యంలలో ఇవి లభ్యమవుతున్నాయి. పరిచయ ఆఫర్‌గా 32జీబీ వెర్షన్‌ను 856 రూపాయలకు, 1టీబీ వెర్షన్‌ను 11,813 రూపాయలకు అందిస్తున్నారు.
మీలోని సృజనశీలిని బయటకు తీసుకురండి
పూర్తిగా పని ఉండి, అసలు ఆటలే ఆడకపోతే ఎంతటి వారైనా నీరసించిపోతారు. ఈ కారణం చేతనే మీరు తగిన విశ్రాంతి తీసుకోవడంతో పాటుగా మీ తరువాత వర్క్‌కేషన్ కోసం పునరుత్తేజితులు కావాల్సిన అవసరమూ ఉంది. మరీ ముఖ్యంగా, మీరు అత్యంత సవాల్‌తో కూడిన ట్రెక్కింగ్స్, నేచర్ వాక్స్‌కు వెళ్లినప్పుడు, అత్యంత అందమైన ప్రదేశాలను మీ కెమెరా కంటితో బంధించాలనుకున్నప్పుడు ఇది తప్పనిసరి ! అప్పుడు శాన్డిస్క్ ఎక్స్ట్రీమ్ పోర్టబల్ ఎస్ఎస్డీలు మీకు ఖచ్చితంగా సరిపోతాయి. ఈ ఎస్ఎస్డీలు అత్యంత కఠినమైన రబ్బర్ కోటింగ్ కలిగి ఉండటం చేత ఒత్తిడికి గురైనప్పటికీ పాడుకావు మరియు వాతావరణ మార్పులను సైతం తట్టుకుని నిలబడుతుంది. అన్ని కాలాల్లోనూ అత్యంత అనుకూలంగా ఉండేలా దీనిని తీర్చిదిద్దడం జరిగింది. సాటిలేని సూపర్‌ఫాస్ట్ డాటా బదిలీ వేగాలు మరియు పోర్టబిలిటీ సమ్మేళనంగా నేటి తరపు అత్యున్నత నాణ్యత కలిగిన కంటెంట్ డిమాండ్స్‌కు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రాంతానికి మీరు ఫోటోసెషన్కు వెళ్లవచ్చు–కళ్లు మూసి తెరిచేంతలో ఆ ఫోటోలను వాస్తవ సమయంలో మీ స్నేహితులకు వాటిని పంపనూ వచ్చు.
500జీబీ మోడల్ ధర 7,999 రూపాయలు, 1టీబీ ధర 12,999 రూపాయలు మరియు 2టీబీ ధర27,499 రూపాయలు. దీనిలో 4టీబీ మోడల్ కూడా ఉంది. ప్రో వెర్షన్ 1టీబీలో 19,999 రూపాయలకు, 2టీబీ 34,999 రూపాయలకు లభ్యమవుతుంది.