Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ కామర్స్ వేదిక మీషో, ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఈ–కామర్స్ యాప్‌గా అక్టోబర్ 2021లో నిలిచిందని సెన్సార్ టవర్ బ్లాగ్ నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన టాప్ –10 గేమింగేతర యాప్‌లలో స్థానం సంపాదించుకున్న ఒకే ఒక్క భారతీయ కంపెనీ మరియు ఈ–కామర్స్ వేదికగా నిలిచింది.
భారత్ యొక్క ఈ–కామర్స్ కలలకు తోడ్పాటునందిస్తోన్న మీషో, ఆగస్టు నుంచి అక్టోబర్ 2021 మధ్యకాలంలో యాప్‌స్టోర్, గుగూల్ ప్లే స్టోర్ల వ్యాప్తంగా 57 మిలియన్ డౌన్లోడ్స్ పూర్తి చేసుకుందని యాప్ అన్నీ వెల్లడించడంతో పాటుగా భారతదేశంలో అన్ని విభాగాలలోనూ అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్‌గా నిలిచింది. ఈ కంపెనీ, భారతదేశంలో ఇన్‌స్టాలేషన్స్ గణనీయంగా వృద్ధి చెందుతున్నాయని గమనించింది. 2021 మూడవ త్రైమాసంలో క్వార్టర్ ఆన్ క్వార్టర్ వృద్ధి 120%కు పైగా నమోదు చేయడంతో పాటుగా భారతదేశంలో త్రైమాస డౌన్లోడ్స్ పరంగా అన్ని ఇతర ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్నూ వెనుక్కినెట్టింది.
విదిత్ ఆత్రేయ్, ఫౌండర్ అండ్ సీఈఓ, మీషో మాట్లాడుతూ ‘‘మా వినియోగదారులే లక్ష్యంగా మా ఆవిష్కరణలను చేస్తుంటాము. పరిశ్రమలో మొట్టమొదటిసారిగా జీరో కమీషన్ నమూనాను విక్రేతల కోసం రూపొందించడం లేదా అతి చురుకైన పరిమాణంలో అప్లికేషన్ నిర్మించడం అయినా సరే, భారతదేశంలో మారుమూల ప్రాంతాల వాసులు కూడా అత్యంత సౌకర్యవంతంగా మీషోను వినియోగించగలరనే భరోసా అందిస్తున్నాము. భారతదేశపు టియర్ 2 + మార్కెట్ల కోసం దృష్టిని కేంద్రీకరించడం కారణంగానే ఈ విజయం మమ్మల్ని వరించింది. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ కామర్స్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతో, భారతదేశపు అసంఘటిత వాణిజ్యపరిశ్రమను మరిన్ని భారత్‌లో మొట్టమొదటి కార్యక్రమాలతో డిజిటైజ్ చేయడాన్ని కొనసాగించనున్నాం’’అని అన్నారు.
ప్రవేశ అవరోధాలను మీషో తగ్గించడంతో పాటుగా టియర్2+ మార్కెట్ల కోసం లాజిస్టికల్ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తుంది మరియు హైపర్ లోకల్ వ్యాపారాలు మరియు ఉత్పత్తులను కనుగొనేందుకు సైతం తోడ్పడుతుంది. ఈ కంపెనీ యొక్క ఐదు రోజుల పండుగ విక్రయాల కార్యక్రమం అక్టోబర్‌లో జరుగడంతో పాటుగా భారతదేశంలో కార్యకలాపాలు జరుగనటువంటి ప్రాంతాలకు సైతం చేరుకుంది. దాదాపు 60%కు పైగా ఆర్డర్లు భారతదేశపు టియర్4 ప్రాంతాల నుంచి వచ్చాయి. వీటిలో మారుమూల ప్రాంతాలైనటువంటి ఖాజ్వాల్ మరియు సొపోర్ కూడా ఉన్నాయి. నేడు 5%కు పైగా భారతీయ గృహాలు మీషోపై ప్రతి రోజూ కొనుగోళ్లు జరుపుతున్నాయి.
డిసెంబర్ 2022 నాటికి 100 మిలియన్ నెలవారీ లావాదేవీలను జరిపే వినియోగదారులను చేరుకోవాలనే లక్ష్యంతో, మీషో ఇప్పుడు నూతన డిజిటల్ వినియోగదారులను ఆన్‌లైన్‌కు తీసుకువచ్చేందుకు బహుళ కార్యక్రమాలను తీసుకువచ్చింది ః
• భారతదేశంలో అతి తేలికపాటి ఈ–కామర్స్ యాప్స్‌లో ఒకటి ః
సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాలను అందించేందుకు, మీషో, ఈ పరిశ్రమలో అత్యంత తేలికపాటి పరిమాణం కలిగిన యాప్‌ను కేవలం 12ఎంబీ పరిమాణంలో నిర్మించింది. తద్వారా ఈ యాప్ అతి తక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ మరియు అతి తక్కువ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ ఉన్న ప్రాంతాలలో సైతం వినియోగించేందుకు అనువుగా ఉంటుంది. అంతేకాదు భారతదేశపు మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్ లాటెన్సీ సవాళ్లను సైతం అధిగమించేందుకు తోడ్పడుతుంది.
• అత్యధిక లాభాల మార్జిన్లకు తోడ్పడటంతో పాటుగా విక్రేతల వృద్ధికీ తోడ్పడుతుంది
పరిశ్రమలో తొలిసారి అనతగ్గ కార్యక్రమాలతో, మీషో ఇప్పుడు విక్రేతలకు దేశవ్యాప్తంగా అతి తక్కువ ఖర్చు కలిగిన వేదకగా నిలువడంతో పాటుగా అత్యధిక లాభాలు మరియు వృద్ధికీ తోడ్పడుతుంది. జూలై 2021లో 0% సెల్లర్ కమీషన్ మోడల్‌ను దేశంలో తొలిసారిగా పరిచయం చేసింది. అప్పటి నుంచి ఈ వేదికపై 10రెట్ల వృద్ధిని విక్రేతల పరంగా నమోదు చేసింది. అక్టోబర్‌లో ఐదు రోజుల పాటు జరిగిన పండుగ కార్యక్రమంలో 136 మిలియన్ రూపాయలను ఆదా చేయడంలో విక్రేతలకు మీషో సహాయపడింది.
• వినియోగదారుల కోసం వృద్ధి చెందుతున్న ఉత్పత్తి విభాగాలు మరియు ఎంపికలు
స్పోర్ట్స్, ఫిట్నెస్, పెట్ సరఫరాలు, ఆటోమోటివ్ యాక్ససరీలు వంటి నూతన విభాగాల జోడింపుతో, మీషో ఇప్పుడు తమ ఉత్పత్తుల జాబితాను 700 విభాగాలకు విస్తరించింది.
• వ్యాపారస్తుల కోసం జీరో ఇన్వెస్ట్మెంట్ వ్యాపారం:
మీషో ఇప్పుడు 15 మిలియన్లకు పైగా వ్యాపారవేత్తలు ఆర్ధిక స్వేచ్ఛను అనుభవించే అవకాశాన్ని అందించడంతో పాటుగా తమ ఆన్లైన్ వ్యాపారాన్ని జీరో ఖర్చుతో ప్రారంభించే అవకాశమూ అందించింది. తద్వారా తమ స్థానిక, వర్ట్యువల్ కమ్యూనిటీలను ఒడిసిపట్టడంతో పాటుగా అతి సులభంగా విక్రయించే అవకాశమూ అందిస్తుంది. గత ఐదు నెలల కాలంలో ఈ ప్లాట్‌ఫామ్‌పై వ్యాపారవేత్తలు ఐదు రెట్లు వృద్ధి చెందారు.