Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.65 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే కాలం లాభం రూ.204 కోట్లతో పోలిస్తే 68 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన షేరుపై 50 పైసల (25 శాతం) రెండో మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించారు. గడిచిన క్యూ2లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.415 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో రూ.828 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2021-22 ద్వితీయార్ధంలో వ్యాపారం పుంజుకోగలదని నాట్కో ఆశాభావం వ్యక్తం చేసింది.