Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వంటనూనె బ్రాండ్ సన్‌ప్యూర్ తన బ్లాక్‌బస్టర్ ఉత్పత్తి ఫిల్టర్డ్ వేరుశెనగ నూనెను హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. తక్కువ సాచురేటెడ్ కొవ్వులు కల్గి, అధిక విటమిన్-ఇ కల్గిన ఈ సన్‌ప్యూర్ ఫిల్టర్డ్ వేరుశెనగ ఆయిల్ 2018లో ప్రారంభించినప్పటి నుండి డిమాండ్‌లో పెరుగుదలను నమోదు చేసింది. అలాగే కరోనా మహమ్మారి నుండి ఈ ఉత్పత్తికి మరింతగా పెరుగుదలను సాధించింది.
కర్ణాటకలో ఈ వేరుశెనగ నూనెకు విశేషమైన స్పందన రావడంతో, కంపెనీ ఉత్పత్తిని తెలంగాణ మరియు ఏపీ మార్కెట్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించింది. 2018లో ఇక్కడ హైదరాబాద్‌లో ప్రారంభించబడిన సన్‌ప్యూర్ మరియు దాని ఫ్లాగ్షిప్ ఉత్పత్తి రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు హైదరాబాద్ కీలక మార్కెట్‌గా ఉంది. కొత్త ఉత్పత్తిని ప్రారంభించడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాజధాని నగరంలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని చూస్తోంది.
ఈ సందర్భంగా సన్‌ప్యూర్ సేల్స్ అండ్ మార్ప్రాకెటింగ్ డైరెక్టర్ మన్నన్ ఖాన్ మాట్లాడుతూ 'కరోనా మహమ్మరి ప్రభావంతో ఇప్పుడు భారతీయ వినియోగదారులు మరింత ఆరోగ్య స్పృహ కలిగి ఉండటంతో, సన్‌ప్యూర్ లాంటి ఆరోగ్యకరమైన వంట నూనెలకు డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నాము. మాకు హైదరాబాద్ ఒక ముఖ్యమైన మార్కెట్, మేము మా పాన్-ఇండియా విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తున్నప్పటికీ, దేశంలోని ఈ భాగం నుండి మరింత ఊపందుకోవాలని మేము భావిస్తున్నాము' అని అన్నారు.