Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఈఎంఐలు ఇకపై భారంగా మారనున్నాయి. తమ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై ఇకపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. దీనికి అదనంగా జీఎస్టి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోళ్లు చేసి ఈఎంఐలోకి మార్చుకుంటే ఇది వర్తించనుంది. ఈ నూతన నిబంధన 2021 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తమ వినియోగదారులకు ఈ మెయిట్ ద్వారా తెలిపింది.