Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ విత్తనాల కంపెనీ కావేరీ సీడ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 45.14 శాతం తగ్గుదలతో రూ.12.83 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని బకాయిలు రాకపోవడంతో కేటాయింపులు పెరగడంతో లాభాలు తగ్గాయని ఆ కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.23.40 కోట్లు ఆర్జించింది. గడిచిన క్యూ2లో కంపెనీ నికర అమ్మకాలు 10.11 శాతం పెరిగి రూ.147.56 కోట్లకు చేరాయి. 2021-22కు గాను మధ్యంతర డివిడెండ్ కింద ప్రతీ రూ.2 ఈక్విటీ షేర్‌పై రూ.4 లేదా 200 శాతం డివిడెండ్‌ను అందించడానికి కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించారు. ఈ మొత్తం రూ.23.39 కోట్ల విలువ చేయనుంది