Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలో భారీగా పెరుగుతోన్న ధరలు స్టాక్ మార్కెట్లను తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 15తో ప్రారంభం కానున్న వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు ఒత్తిడికి గురి కావొచ్చని విశ్లేషిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెద్దగా ఆశాజనకంగా లేకపోయినప్పటికీ.. భారత స్టాక్ మార్కెట్లు కరోనా కాలంలోనూ పరుగులు పెట్టాయి. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా భారీ లాభాలతో నూతన రికార్డులను చేరాయి. కాగా.. ఇటీవల తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలపై మదుపర్ల నిరుత్సాహం, ఆర్థిక వ్యవస్థలో కొత్తగా ఎలాంటి సానుకూల సంకేతాలు కానరాకపోవడంతో వచ్చే వారం మార్కెట్లలో అమ్మకాలు కొనసాగొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి విలువ, అమెరికా ఫెడ్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని అంచనా వేస్తున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సహా అన్నింటి ధరలూ వరుసగా పెరుగుతుండటంతో అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం అంతకుముందు నెలతో పోలిస్తే 4.35 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగింది. ఇక ఆహార ద్రవ్యోల్బణం సైతం సెప్టెంబర్‌లో 0.68 శాతం నుంచి అక్టోబర్‌లో 0.85 శాతానికి ఎగిసింది.
.